టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి తమన్నా ( Thamanna ) ఒకరు.ఈమె యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ హీరోల సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా ఒకప్పుడు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తమన్న ప్రస్తుతం మాత్రం సౌత్ ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించి బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తమన్నా బిజీగా గడుపుతున్నారు.ఇక ఈమె నటించిన బాహుబలి ( Bahubali ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత తనకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయని చెప్పాలి.
బాహుబలి పార్ట్ 1 లో అవంతిక ( Avanthika ) పాత్రలో తమన్న ఎంతో అద్భుతంగా నటించారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె బాహుబలి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాహుబలి సినిమాలో నటించిన నటీనటులందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఇక తమన్నా మాత్రం ఈ సినిమాలో నటించిన తర్వాత తనకు అసలైన కష్టాలు మొదలయ్యాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాహుబలి సినిమా పూర్తి అయిన తర్వాత నా మదిలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి.అప్పుడే అసలు సిసలైన కష్టాలు కూడా వచ్చాయని తమన్నా తెలిపారు.
బాహుబలి కంటే పెద్ద సినిమాలో నటించగలమా? బాహుబలి తర్వాత ఏం చేయాలి? దీనికంటే పెద్ద సినిమాలు ఏమైనా చేయాలా? నేను మళ్ళీ అలాంటి సినిమాల్లో నటించగలనా ? అని ఎన్నో ఆలోచనలు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాయి అంటూ తమన్నా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.