ప్రియురాలిని దారుణంగా హతమార్చిన కేసులో భారత సంతతి వ్యక్తికి యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది.ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని తన ఇంట్లో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
నిందితుడిని రాజ్ సిద్పారా (Raj Sidpara)(50)గా గుర్తించారు.ఇతను తన ప్రియురాలు తర్న్‌జీత్ రియాజ్(Tarnjeet Riaz) (44)ను హతమార్చినట్లు లీసెస్టర్ క్రౌన్ కోర్టు తేల్చింది.
లీసెస్టర్‌షైర్ పోలీసులు(Leicestershire Police) తెలిపిన వివరాల ప్రకారం.సిద్పారాకు కోర్టు జీవిత ఖైదు విధించింది.రాజ్ – తర్న్‌జీత్‌లు(Tarnjeet Riaz, Raj ) దాదాపు ఐదు నెలలుగా రిలేషన్‌లో ఉంటున్నారట.ఈ క్రమంలో ఈ ఏడాది మే 6న తర్బత్ రోడ్‌లో తర్న్‌జీత్ శవమై తేలింది.
నిందితుడి దాడిలో ఆమె ముఖంపై గాయాలతో పాటు పక్కటెముకలు విరిగిపోయినట్లుగా పోస్ట్‌మార్టం నివేదిక తెలిపింది.విచారణ సందర్భంగా గత నెలలో తన ప్రియురాలిపై దాడి చేసినట్లుగా రాజ్ అంగీకరించాడు.
అయితే ఆమెను చంపాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపాడు.
![Telugu Harshita Brella, Indian Origin, Leicestershire, Raj Sidpara, Tarnjeet Ria Telugu Harshita Brella, Indian Origin, Leicestershire, Raj Sidpara, Tarnjeet Ria](https://telugustop.com/wp-content/uploads/2024/12/Indian-origin-man-sentenced-to-life-imprisonment-in-UK-for-girlfriends-murder-b.jpg)
మీరు ఆమెపై క్రూరంగా, కనికరం లేకుండా దాడి చేశారని తుది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ విలియం హర్బేజ్(Justice William Harbage) వ్యాఖ్యానించారు.ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్‌తో రాజ్ బాధపడుతున్నాడని.గర్ల్ ఫ్రెండ్స్ సహా వారితో సంబంధం ఉన్న వ్యక్తులను చంపుతామని అతను బెదిరింపులకు పాల్పడినట్లుగా కోర్టు దృష్టికి వచ్చింది.
మహిళలు, బాలికలపై హింసను లక్ష్యంగా చేసుకున్న వైట్ రిబ్బన్ డేకు మద్ధతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్ధల్లో రాజ్ చేరినట్లుగా లీసెస్టర్‌షైర్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
![Telugu Harshita Brella, Indian Origin, Leicestershire, Raj Sidpara, Tarnjeet Ria Telugu Harshita Brella, Indian Origin, Leicestershire, Raj Sidpara, Tarnjeet Ria](https://telugustop.com/wp-content/uploads/2024/12/Indian-origin-man-sentenced-to-life-imprisonment-in-UK-for-girlfriends-murder-c.jpg)
కాగా.మరో ఘటనలో ఇదే వెస్ట్ మిడ్ లాండ్స్ ప్రాంతంలో అదృశ్యమైన భారత సంతతికి చెందిన హర్షిత బ్రెల్లా(Harshita Brella) (24) కారులోనే శవమై తేలారు.ఈ కేసుకు సంబంధించి భారత సంతతికి చెందిన ఆమె భర్తను నిందితుడిగా అనుమానించిన పోలీసులు గాలిస్తున్నారు.
ఈ కేసులో వరకట్న వేధింపుల అంశం తెరపైకి వచ్చింది.