అమెరికా అతధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) విజయం సాధించడంతో అగ్రరాజ్యంలో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా వలసదారులను ఇష్టపడని ట్రంప్ .
ఇమ్మిగ్రేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనని అంతా బిక్కుబిక్కుమంటున్నారు.ఈ భయాలతో పలు అమెరికన్ విశ్వవిద్యాలయాలు తమ అంతర్జాతీయ విద్యార్ధులు,( Foreign Students ) సిబ్బందికి ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి.
ట్రంప్ ప్రమాణ స్వీకారం( Trump’s Swearing-In ) చేసే సమయానికి ముందే (జనవరి 20 లోగా) యూఎస్‌కి తిరిగి రావాలని కోరాయి.
జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తన మొదటి రోజే ఆర్ధిక వ్యవస్ధ, ఇమ్మిగ్రేషన్ సమస్యలకు సంబంధించి పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
ప్రెసిడెంట్‌గా ఆయన తొలిసారి పదవీకాలంలో పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్( Travel Ban ) విధించారు.ఈ సమయంలో పలు విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ విద్యార్ధులు, అధ్యాపకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
గత అనుభవాల దృష్ట్యా అలాంటి పరిస్ధితులు చోటు చేసుకోకుండా అమెరికన్ వర్సిటీలు జాగ్రత్తలు పడుతున్నాయి.

యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.అమెరికాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్ధులలో సగానికి పైగా (54 శాతం) ఇండియా , చైనా దేశాలకు చెందినవారే.ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం .2023-24లలో అమెరికాలో 3,31,602 మంది అంతర్జాతీయ విద్యార్ధులతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.ఇది గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.2,77,398 మంది విద్యార్ధులతో చైనా ఈ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది.క్షీణత ఉన్నప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్, నాన్ డిగ్రీ విద్యార్ధులను అత్యధికంగా అమెరికాకు పంపే దేశంగా చైనా ఉంది.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే ట్రంప్ 2017 జనవరిలో ఏడు ముస్లిం మెజారిటీ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలకు చెందిన వారిని దాదాపు 90 రోజుల పాటు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.దీనిపై పౌర హక్కుల సంఘాలు, సంస్ధలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే.