ఒక్కోసారి అదృష్టం ఎలా వరిస్తుందో తెలియని పరిస్థితి.ఒక్కోసారి అనుకొని సంఘటనల వల్ల అదృష్ట దేవత తలుపు తట్టి కాసుల వర్షం కురిపిస్తుంది.
అచ్చం అలాగే సింగపూర్ కు( Singapore ) చెందిన ఒక వ్యక్తికి అదృష్టం తలుపు తట్టినట్లు ఏకంగా 8 కోట్ల లాటరీని సొంతం చేసుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
సింగపూర్ లోని 21 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న బాలసుబ్రమణ్యం చిదంబరం( Balasubramanian Chithambaram ) అనే వ్యక్తి తన భార్య కోసం 6000 డాలర్లు విలువైన ఒక బంగారు చైన్( Gold Chain ) కొనుగోలు చేశాడు.
ఈ క్రమంలో ముస్తఫా జ్యువెలరీలో( Mustafa Jewellery ) నిర్వహించిన లక్కీ డ్రాలో చిదంబరం కూడా ఒక వ్యక్తి.వాస్తవానికి 250 డాలర్ల కన్నా ఎక్కువగా విలువగల ఆభరణాన్ని కొనుగోలు చేసిన వారికి దీనికి అర్హులు.ఈ జ్యువెలరీ వారు నిర్వహించిన లక్కీ డ్రాలో అతను 8 కోట్లను సొంతం చేసుకున్నాడు.
ఇంత పెద్ద మొత్తంలో లక్కీ డ్రాలో గెలుచుకోవడంతో ఒక్కసారిగా చిదంబరం కన్నీళ్ళతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అయితే, తన నాన్నగారి వర్ధంతి రోజు ఈ వార్త వినడం మరింత సంతోషకరంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నాడు.అలాగే, తాను సొంతం చేసుకున్న లక్కీ డ్రాలో వచ్చిన డబ్బులను కొంత మొత్తాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు చిదంబరం తెలియచేశాడు.ఇక సంఘటన చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.అదృష్టం అంతే నీదే భయ్యా.అంటూ కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే, మరికొందరు అదృష్ట దేవత తలుపు తట్టి మరీ నీ ఇంటికి వచ్చినట్లు ఉందని రాసుకొని వచ్చారు.