ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.31
సూర్యాస్తమయం: సాయంత్రం.5.41
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.8.23 ల9.45
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది.కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది.
నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.
వృషభం:

ఈరోజు చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి.ధన వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు.సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
భాగస్వామ్య వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
మిథునం:

ఈరోజు బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.ఆకస్మిక ధన లాభాలు పొందుతారు.వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు కొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి.దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది.ఆదాయం ఆశించిన విధంగా ఉండదు.
చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
సింహం:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బయటపడతారు.ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు పొందుతారు.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది.వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది.
కన్య:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు.కుటుంబ సభ్యులతి అకారణ వివాదాలు కలుగుతాయి.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి.వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి.
తుల:

ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు.సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు.దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.
వృత్తి వ్యాపారాలు నిదానంగా మాత్రంగా సాగుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు.
వృశ్చికం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారములు అందుతాయి.ఇంట, బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి.ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి.
ధనుస్సు:

ఈరోజు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
దీర్ఘ కాలిక రుణాల తీరి ఊరట చెందుతారు.గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు.వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.
మకరం:

ఈరోజు కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది.
ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.
కుంభం:

ఈరోజు దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు.వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలొ నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు.గృహమున శుభకార్యాలలో నిర్వహిస్తారు.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
మీనం:

ఈరోజు దూర ప్రాంతాల ఆప్తుల నుంచి కీలక నమాచారం అందుతుంది.చేపట్టిన కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తిచేస్తారు.స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు.