జేసీ దూకుడు పై చంద్రబాబు సీరియస్ .. వార్నింగ్ 

పార్టీ నేతలంతా క్రమశిక్షణ తో వెలుగుతూ,  ప్రజల్లో పార్టీ పరపతి పెంచే విధంగా ప్రయత్నించాలని,  పదేపదే టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) చెబుతూనే ఉంటారు.ఇక ఏపీలో టిడిపి , జనసేన,  బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.

 Chandrababu's Serious Warning On Jc Aggression , Mla Jc Asmith Reddy , Tdp, Jana-TeluguStop.com

అయితే కొంతమంది పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా,  పార్టీకి డామేజ్ జరుగుతుండడం,  ప్రజలలోను చులకన భావన ఏర్పడుతుండడం వంటి వ్యవహారాలపై చంద్రబాబు సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు.కడపలోని ఆర్టిపీపీ ఫ్లై యాష్  కాంట్రాక్టు ను తమకే కావాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి( Chairman JC Prabhakar Reddy ),  జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి( MLA Adinarayana Reddy ) ల మధ్య వివాదం చోటు చేసుకోవడం , ఈ వ్యవహారం మీడియాలో హైలెట్ అవుతుండడం వంటి వ్యవహారాలపై చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు.

Telugu Chairmanjc, Chandrababus Jc, Janasena, Mlaadinarayana, Mlajc-Telugu Polit

ఈ కాంట్రాక్టు విషయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా,  పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందున తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ( MLA JC Asmith Reddy )కి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.  ఇలా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కుదరదని చంద్రబాబు సీరియస్ గానే చెప్పారట.  ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే ఇక పార్టీ ఎందుకని అస్మిత్ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. 

Telugu Chairmanjc, Chandrababus Jc, Janasena, Mlaadinarayana, Mlajc-Telugu Polit

నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికేందుకు జేసీ అస్మిత్ రెడ్డి వెళ్లారు .ఈ పర్యటనకు జేసీ ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉన్నారు.  జెసి అస్మిత్ రెడ్డిని పక్కకు తీసుకువెళ్ళిన చంద్రబాబు కొంత సీరియస్ గానే ఈ వ్యవహారంపై వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం .బూడిద తరలింపు వ్యవహారంలో ఇలా రోడ్డున పడితే పార్టీ పరువు ప్రతిష్టలు ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలి తప్ప,  రోడ్డున పడి సవాళ్లు విసురుకుంటే ప్రజలు నవ్వుకోరా అని చంద్రబాబు జేసి అస్మిత్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

  ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube