సాధారణంగా మహిళలు ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.అనేక నియమాలను పాటిస్తారు.
కానీ, ప్రసవం అయిన తర్వాత కూడా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.ముఖ్యంగా డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాలను బాలింతలు ఖచ్చితంగా చేర్చుకోవాలి.
అటువంటి ఫుడ్స్‌లో రాగులు ఒకటి.బాలింతలు రాగులను ఎందుకు తప్పని సరిగా తినాలి.? అసలు రాగుల వల్ల వారికి లభించే ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే రాగుల్లో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటిమన్ బి, ఫైబర్, ప్రోటీన్ ఇలా పోషకాలు ఎన్నో నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా రాగులు బోలెడన్ని ప్రయోజనాలను కలిగిస్తాయి.
ముఖ్యంగా బాలింతలు రాగులతో చేసే జావ, సంగటి, దోశ, రొట్టె, లడ్డు వంటివి తీసుకుంటే పాల ఉత్పత్తి అద్భుతంగా పెరుగుతుంది.
అలాగే ప్రసవం తర్వాత బాలింతల్లో రక్త హీనత సమస్య చాలా అధికంగా ఉంటుంది.
అయితే రాగులతో చేసిన వంటలను తీసుకోవడం వల్ల… అందులో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాల సంఖ్యను వృద్ధి చేసి రక్త హీనత సమస్యను నివారిస్తుంది.
ప్రసవం అయిన అనంతరం బరువు తగ్గేందుకు మహిళలు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారు రాత్రుళ్లు వైట్ రైస్, గోధుమ పిండితో చేసిన చపాతీల కంటే రాగి పిండితో చేసిన రొట్టెలను తీసుకోవాలి.తద్వారా అందులోని ఫైబర్ కంటెంట్ వెయిట్ లాస్ అయ్యేందుకు గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.
డెలివరీ తర్వాత బాలింతలు చాలా నీరసంగా, బలహీనంగా ఉంటారు.అయితే రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే.
అందులోని ప్రత్యేకమైన పోషక విలువలు బోలెడంత శక్తిని అందించి బాలింతలో నీరసం, అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తాయి.