మేడమ్ మీ పెళ్లి ఎప్పుడు.. మా అమ్మను అడిగి చెప్తా.. హీరోయిన్ షాకింగ్ ఆన్సర్!

రోజు రోజుకి టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది.సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో అభిమానులు, సెలబ్రిటీల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది.

 Heroine Ruhani Sharma Talking About Her Marriage, Ruhani Sharma, Social Media, Shocking Answer, Marriage, Netizens-TeluguStop.com

ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో వారి జీవితంలో జరిగిన విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతున్నారు.

దీనిని కొంతమంది నెటిజన్స్ ఆసరాగా తీసుకుని సెలబ్రిటీలకు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా అయితే హీరోయిన్ ల విషయంలో ఈ విషయం బాగా వర్తిస్తుంది అని చెప్పవచ్చు.

 Heroine Ruhani Sharma Talking About Her Marriage, Ruhani Sharma, Social Media, Shocking Answer, Marriage, Netizens-మేడమ్ మీ పెళ్లి ఎప్పుడు.. మా అమ్మను అడిగి చెప్తా.. హీరోయిన్ షాకింగ్ ఆన్సర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలామంది నెటిజన్స్ హీరోయిన్స్ చిట్ చాట్ నిర్వహించినప్పుడు అలాగే లైవ్ లో అభిమానులతో ముచ్చటించినప్పుడు కొందరు మితిమీరి మరి ప్రశ్నలు వేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడు.? ఈ ప్రశ్నకు కొందరు హీరోయిన్ లు ఓపికగా సమాధానం చెప్పగా మరికొంతమంది విచిత్రంగా సమాధానాలు చెబుతూ ఉంటారు.

ఒకవైపు డేటింగ్ చేస్తూ, మరోవైపు కెరీర్ పై దృష్టి పెట్టామంటారు.

మరికొందరు హీరోయిన్ లు అయితే ప్రేమిస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెబుతుంటారు.ఇంకొందరు మాత్రం తప్పించుకుంటారు.

ఇప్పుడు తాజాగా హీరోయిన్ రుహానీ శర్మకు అదే ప్రశ్న ఎదురైంది.చిలసౌ సినిమాతో తెలుగులో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హిట్ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం నాని నిర్మాతగా, మీట్ క్యూట్ అనే సినిమాలో నటిస్తోంది.సినిమాల కంటే హాట్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.

అసలు విషయం లోకి వెళ్తే.పెళ్లి ఇప్పుడు అన్న ప్రశ్నకు ఈమె అందరి హీరోయిన్స్ లా కాకుండా ఈమె కాస్త తెలివిగా సమాధానం ఇచ్చింది.

పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు…అమ్మను అడిగి చెబుతాను అని రిప్లై ఇచ్చింది.అయితే ఈ ఒక్క రిప్లయ్ లో బోలెడన్ని సమాధానాలు ఊహించుకోవచ్చు.అందులో భాగంగానే ఆమె ఎవరినీ లవ్ చేయడం లేదని ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, లేదంటే వరుడు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడని,బయటకు చెప్పాలా వద్దా అనేది అమ్మను అడిగి చెబుతా అనే అర్థం కూడా తీసుకోవచ్చు. రుహానీ శర్మ రిప్లయ్ పై ఇలానే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కానీ రుహానీ మాత్రం అంతకుమించి వివరణ ఇవ్వలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube