కరోనా కొత్త పాజిటివ్ కేసులతో ఇండియా అతలాకుతలమవుతోంది.దాదాపు రోజుకు రెండు లక్షల కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతూ ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెంబేలెత్తిపోతున్నాయి.
కేసులు ఎక్కువగా బయట పడుతున్న రాష్ట్రాలలో ఢిల్లీ రాష్ట్రం కూడా ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా నిబంధనలు కఠినం చేసిన ఢిల్లీ సర్కార్ తాజాగా ఈ మహమ్మారిని మరింతగా కట్టడి చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
మేటర్ లోకి వెళ్తే వారాంతపు కర్ఫ్యూ రేపటి శుక్రవారం నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఇటీవల రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అధిగమించడానికి కట్టడి చేయడానికి రాష్ట్ర ఉన్నత అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ మరియు మంత్రులతో భేటీ అయిన సీఎం కేజ్రీవాల్ అందరితో చర్చించి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి సోమవారం 6 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచన చేసినట్లు స్పష్టం చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో బెడ్స్ కొరత లేదని కేజ్రీవాల్ తెలిపారు.అంతే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీడియా వ్యవహరించకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఇప్పటికే ఢిల్లీలో సినిమా థియేటర్ల విషయంలో సీటింగ్‌ను 30 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగిందని అదేవిధంగా మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పా మూసివేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.ఇక వివాహ కార్యక్రమాలకు సంబంధించి కర్ఫ్యూ పాస్‌లు జారీ చేయటం జరిగిందని పేర్కొన్నారు.