Sp Shailaja: నేను అందుకే ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించాను : ఎస్పీ శైలజ

ఎస్పీ శైలజ( SP Shailaja ).సింగర్ గా, ప్రముఖ గాయకుడు బాలు సోదరిగా, శుభలేఖ సుధాకర్ ( Shubhalekha Sudhakar )కి అర్ధాంగిగా ఆమె మనందరికీ తెలుసు.శైలజ నేపథ్య గాయని గా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో పాటలు పాడి ప్రస్తుతం బుల్లితెరపై రియాల్టీ షోలలో జడ్జిగా బిజీగా ఉన్నారు.80 మరియు 90 వ దశకాల్లో కెరియర్ లోనే అత్యంత బిజీగా సినిమాలో పాటలు పాడారు శైలజ.కేవలం సింగర్ గానే కాదు శైలజ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు అప్పట్లో హీరోయిన్ టబు, సోనాలి బింద్రే, శ్రీదేవి వంటి హీరోయిన్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేవారు.

 Thats Why I Acted In Only One Movie-TeluguStop.com
Telugu Sailaja, Sp Balu, Sp Sailaja-Telugu Stop Exclusive Top Stories

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ( Telugu, Tamil, Kannada, Malayalam ) సినిమాల్లో వందల్లో పాటలు పాడిన శైలజ నెల్లూరు జిల్లాలోని హరికథ కళాకారుడైనటు వంటి సాంబమూర్తి కుటుంబంలో జన్మించింది.1989లో నటుడిగా సెటిల్ అయిన శుభలేఖ సుధాకర్ ను వివాహం చేసుకుంది.ఈ జంటకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

అతడి పేరు శ్రీకర్( Srikar ).

Telugu Sailaja, Sp Balu, Sp Sailaja-Telugu Stop Exclusive Top Stories

ఇక సింగర్ గా శైలజ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ముఖ్యంగా నేటి తరం వారికి తెలియని విషయం ఆమె నటిగా కూడా ఒక సినిమాలో నటించారు అని.శైలజ నటించిన ఏకైక చిత్రం సాగర సంగమం( sgara sangamam ).ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్ పాత్రలో నటించింది శైలజ కమల్ హాసన్ తో పోటీ పడుతూ ఆమె చేసిన నృత్యం కానీ నటన కానీ అప్పట్లో సంచలనం అనే చెప్పాలి.ఇలాంటి ఒక గొప్ప చిత్రంలో నటించిన తర్వాత ఎన్ని సినిమాలు తీసిన మళ్లీ ఆ పేరు రాదు అని నమ్మిన శైలజ ఆ తర్వాత ఎంతమంది అడిగినా కూడా నటించలేదు.అలా ఆమె చేసిన మొట్టమొదటి మరియు చివరి సినిమా సాగర సంగమం.

ఈ చిత్రానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఆమె ఎన్నోసార్లు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube