విజయవాడలో నడిరోడ్డుపై మహిళా దారుణ హత్య..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని.

 Brutal Murder Of A Woman On The Road In Vijayawada Details, Crime News, Vijayaw-TeluguStop.com

అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని విశాఖలో జరిగిన పార్టీ కార్యక్రమంలో సంచలన ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా శనివారం విజయవాడలో( Vijayawada ) నడిరోడ్డుపై మహిళని అత్యంత దారుణంగా నరికి చంపేశారు.అయితే ఈ హత్య( Murder ) కుటుంబ కలహాల కారణంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే జక్కంపూడి కాలనీకి చెందిన నాగమణి రెండో కుమార్తెతో అల్లుడికి గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.ఈ క్రమంలో కోర్టులో కేసు కూడా నడుస్తోంది.అయితే అత్తమామ పై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేష్.అత్తమామలతో మాట్లాడుకుందామని పిలవడం జరిగిందట.ఈ క్రమంలో వాళ్ళు రావటంతో మాట్లాడుకునే క్రమంలో వివాదం తలెత్తడంతో అల్లుడు రాజేష్ మామపై కత్తితో దాడి చేయబోగా… అతడు తప్పించుకోవటంతో.అత్తను నరికి చంపాడు.

హత్య చేసిన అనంతరం నిందితుడు పరారయ్యాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube