మనిషి చివరి క్షణాలలో.. ఈ వస్తువులు దగ్గర్లో ఉంటే స్వర్గం ఖాయం..!

గరుడ పురాణంలో( Garuda Puranam ) మరణ సమయంలో ఒక వ్యక్తి ఎలాంటి అనుభవాన్ని పొందుతాడో వివరంగా ఉంది.మరణం తర్వాత( After Death ) ఆత్మ ఎలాంటి సుఖ దుఃఖాలను పొందుతుంది.

 In The Last Moments Of Man Heaven Is Certain If These Things Are Near Details, A-TeluguStop.com

ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఎలాంటి స్థానానికి చేరుకుంటుందో గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది.ఒక వ్యక్తి తన కర్మల ప్రకారం మరణం తర్వాత స్వర్గం లేదా నరకం పొందుతాడు.

అయితే చనిపోయినప్పుడు కొన్ని వస్తువులు ఆ వ్యక్తి దగ్గర ఉంచితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం ఉండదని గరుడ పురాణంలో పేర్కొన్నారు.మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Garuda Puranam, Heaven, Hell, Tulsi-Latest News - Telugu

ఒక వ్యక్తి మరి కాసేపు కాసేపట్లో చనిపోతాడు అని తెలిసినప్పుడు వెంటనే అతన్ని తులసి మొక్క( Tulsi Plant ) దగ్గర పడుకోబెట్టాలి.దీనితో పాటు తులసి ఆకులు, మంజరి అతని నుదుటిపై పెట్టాలి.ఇలా చేయడం వల్ల మరణం తర్వాత ఆత్మ యమలోకానికి వెళ్ళదని నమ్ముతారు.చాలా చోట్ల ఒక వ్యక్తి చనిపోయే ముందు తులసి నీళ్లను నోట్లోకి పోస్తారు.అలాగే చనిపోయిన తర్వాత వారి నోటిలో తులసి ఆకులు కలిపిన గంగాజలం పోయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం.కానీ ఒక వ్యక్తి చనిపోయే ముందు అతని నోటిలో గంగాజలం పొయ్యాలి.

ఇది అతని జీవితకాలంలోనీ అన్ని పాపాలను నాశనం చేస్తుంది.

Telugu Garuda Puranam, Heaven, Hell, Tulsi-Latest News - Telugu

ఫలితంగా మరణం తర్వాత అతని ఆత్మ స్వర్గంలో స్థానం సంపాదించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే నల్ల నువ్వులు విష్ణువు దూళి నుంచి ఉద్భవించాయని చెబుతూ ఉంటారు.మరణానికి ముందు వ్యక్తి చేతి నుంచి నువ్వులను దానం చేయడం వలన యమ దూతలు మరణం తర్వాత ఆత్మకు భంగం కలిగించరు.

అదే సమయంలో అసురులు, రాక్షసులు, దానవులు అందరూ కూడా పారిపోతారు.ముఖ్యంగా చెప్పాలంటే మరణ సమయంలో దర్భాసనంపై పడుకోబెట్టి మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకును ఉంచినట్లయితే ఆ వ్యక్తి ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

దర్భ అనేది ఒక పవిత్రమైన గడ్డి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube