గురు పౌర్ణమి( guru pournami ) రోజు బాబా పటం ముందు ఇదొక్కటి పెడితే చాలా రోజుల నుంచి ఉన్న దరిద్రం పోయి అదృష్టం పట్టి కోటీశ్వరులు అవుతారని పండితులు చెబుతున్నారు.జులై 3వ తేదీన గురుపౌర్ణమి రోజు బాబా పటం ముందు మనం పెట్టవలసింది ఏమిటి.
ఇలా పెడితే అదృష్టం పట్టి మనం కోటీశ్వరులం ఎలా అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం.గురు అంటే పాఠశాల గుర్తుకొస్తుంది.
ఎందుకంటే మనకు మొదటి గురువు తల్లి అయితే ఆ తర్వాత మనం గౌరవించేది గురువుని మాత్రమే.

అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు, విష్ణుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః చిన్నప్పటినుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం.మొదటి గురువుగా తల్లి మనకు జ్ఞానాన్ని అందిస్తుంది.అలాగే ప్రపంచాన్ని కూడా చూపిస్తుంది.
తల్లి తరువాత ఈ ప్రపంచంలో ఏది మంచి, ఏది చెడు అటువంటి విషయాలను తెలియజేసేది గురువు మాత్రమే.ఇలాంటి గురువుని మనం పూజించడం కోసం చక్కగా ఒక తిధిని నిర్ణయించబడింది.
అటువంటి గురు పౌర్ణమి రోజున ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.మీరు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత తెల్లని దుస్తులను( White dress ) కానీ పసుపు రంగు దుస్తులను ధరించాలి.
అలా ధరించిన తర్వాత నుదుటన సింధూరం అలంకరించుకోవాలి.రేపు గురుపౌర్ణమి అనగా ఈ రోజు సాయంత్రం మనం చేయవలసిన పని ఒకటి ఉంది.
అదేంటంటే కొమ్ము శనగలను నానబెట్టి మరుసటి రోజున పచ్చిశనగలతో 11,21,47,51,101,108 ఈ అంకెలలో ఏదో ఒక మాలను సిద్ధం చేయాలి.

అలా సిద్ధం చేసుకున్నటువంటి మాలను మనం బాబా మెడలో అలంకరించుకోవాలి.కొన్ని పచ్చిశనగలతో( beans ) తాలింపు వేసి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి.ఇలా చేయడం ద్వారా గురువు అనుగ్రహం మనకు లభించడం జరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే సాయిబాబా విగ్రహం కానీ లేక పటం కానీ తీసుకొని పటాన్ని శుభ్రపరిచి గంధం, కుంకుమ, బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి.అప్పుడు మనకు మంచి ఫలితం అనేది దక్కుతుంది.
వీలైతే మీరు పసుపు రంగు పూలతో బాబాను అలంకరించాలి.అలాగే ఏదైనా బాబా గుడికి వెళ్ళండి.