మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు ఇంటిని( House ) నిర్మించుకోవాలంటే ముందుగా వాస్తు నిప్పులను సంప్రదిస్తారు.ఎందుకంటే వాస్తు సరిగ్గా ఉంటేనే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అలాగే వాస్తు నియమాలను అనుసరించి ఏ విధంగా అయితే ఇంటిని నిర్మించుకోవాలో అలాగే ఇంట్లో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అలంకరించాలని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇంట్లో మెట్ల నిర్మాణం కూడా సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి.
సరైన దిశలో మెట్ల నిర్మాణం లేకపోతే కచ్చితంగా ఆర్థిక సమస్యలు( Financial problems ) కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.మెట్ల నిర్మాణం చేసేటప్పుడు కచ్చితంగా వాస్తు నియమాలను పరిగణలోకి తీసుకోవాలి.

వాస్తు శాస్త్రం( Vastu Shastra ) మెట్ల కోసం కొన్ని నియమాలను నిర్దేశిస్తుంది.వీటిని అనుసరించి మెట్ల నిర్మాణం చేసుకుంటే కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది.సరైన దిశలో మెట్ల నిర్మాణం చేపడితే జీవితం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.వాస్తు శాస్త్రంలో నైరుతి దిశలో మెట్లు నిర్మాణం చేయడం మంచిదని కూడా చెబుతున్నారు.ఈ దశలో మెట్లు ఉంటే ఇల్లు సంతోషంతో పాటు శ్రేయస్సు కూడా ఉంటుంది.అలాగే ఈశాన్యంలో మెట్లు ఉంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు( Business problems ) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఇంటి ఆగ్నేయంలో( southeast ) మెట్లు నిర్మించడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదని చెబుతున్నారు.

ఇలా ఉంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు ( Health problems )తప్పవని కూడా చెబుతున్నారు.అలాగే మెట్ల పరిమాణంలో తేడా ఉంటే కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు అని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు ప్రకారం మెట్ల సంఖ్య ఎప్పుడు బేసి సంఖ్యలో ఉండాలి.
సరి సంఖ్యలో మెట్లు ఉంటే అవి దురదృష్టాన్ని తీసుకొని వస్తాయి.అలాగే మెట్లు ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలి.
అలాగే ఇరుకైన మెట్లు అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తాయి.