ఉపాసన, రామ్ చరణ్ ల ముద్దుల కూతురు క్లిన్ కారా( klin Kara ) పుట్టినప్పటినుంచి అల్లు అర్జున్ కొడుకు అయాన్( Ayan ) ను బాగా టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు నెటిజెన్స్.ఎందుకంటే రామ్ చరణ్ కు అయాన్ అల్లుడు కాబట్టి.
దీంతో రామ్ చరణ్ కూతురికి అయాన్ వరుసకు బావ అవ్వటంతో ఇక వీరిద్దరే పెళ్లి చేసుకుంటారు అని తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు నెటిజన్స్.
అంతేకాకుండా వీరికి సంబంధించిన కొన్ని మీమ్స్ తో కూడిన ట్రోల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఇప్పటివరకు అయాన్ కు సంబంధించిన ఎటువంటి విషయం కానీ సోషల్ మీడియాలో వైరల్ కాలేదు.ఇక ఎప్పుడయితే చరణ్ కూతురు మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టిందో అప్పటినుంచి జనాలు పాపకు సంబంధించిన ప్రతి ఒక విషయాన్ని బాగా లోతుగా పరిశీలించి తీశారు.

పాప పుడితే ఉపాసన, చరణ్( Upasana, Charan ) ల జాతకాలు ఎలా ఉంటాయో.అంతేకాకుండా పాపకు ఏ పేరు పెడతారో ఇలా పాప పుట్టినప్పటినుంచి ప్రతి ఒక్క విషయాన్ని బాగా లోతుగా పరిశీలించారు.అంతేకాకుండా పాప – పిన్ని బాబాయ్ లు, తాతయ్య – నానమ్మలు, అత్త – మామయ్యలు ఇలా పాపకు సంబంధించిన వాళ్ళ పేర్లను వైరల్ చేయగా కాబోయే వాడు అయాన్ అని పేరు తీసి బాగా చర్చకు దారి తీశారు.ఇలా వీరి గురించి చాలా మీమ్స్ వచ్చినప్పటికీ కూడా అటు మెగా ఫ్యామిలీ( Mega Family ), ఇటు అల్లు ఫ్యామిలీ వాటిపై ఏమి స్పందించలేదు.
అంటే వాళ్లకు కూడా ఆ వరుస నచ్చిందేమో అని కొందరు అనుకుంటున్నారు.అయితే పాపకు రీసెంట్ గా సాంప్రదాయం ప్రకారం మెగా ఫ్యామిలీ ఉయ్యాల ఫంక్షన్ చేసిన సంగతి తెలిసిందే.
పాపను ఉయ్యాలలో వేసిన రోజే పాపకు క్లిన్ కారా అని పేరు పెట్టేశారు.

ఇక ఈ పేరు లలిత సహస్రనామం నుండి తీసుకున్నట్లు తెలిసింది.మెగా వారసురాలకు ఈ పేరు పెట్టడంతో ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.మంచి పేరు పెట్టారు అని చాలామంది ప్రశంసించారు.
అయితే కొందరు నెటిజన్స్ అయాన్ ను మర్చిపోకుండా మరోసారి టార్గెట్ చేసి తన పేరుతో పాటు క్లిన్ కారా పేరుతో కలిపి ఫ్లేమ్స్ చేశారు.దీంతో అందులో వారిద్దరి పేర్లలో ఉన్న సేమ్ అక్షరాలు కట్ చేయటంతో చివరికి మ్యారేజ్ అని వచ్చింది.
అంటే వీరిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు అని వచ్చింది.ఇంకేముంది జనాలు మరింత ఆడుకోవడం మొదలుపెట్టారు.
మొత్తానికి అయాన్ కు ఈ విధంగా లాగటంతో మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు.ఇక వీరు పెద్దవుతున్న కొద్ది.
వాళ్ళిద్దరికీ ఇష్టం లేకున్నా కూడా మీమ్స్, ట్రోల్స్ ద్వారా జనాలే వీరిని ఒకటి చేసేలాగా అనిపిస్తుంది.ఇక రీసెంట్ గా జరిగిన ఉయ్యాల వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరు కాగా చాలామంది పాపకు విలువైన బహుమతులు ఇచ్చారు.
ఇక ఆ బహుమతులకు సంబంధించిన వార్తలు కూడా బాగా వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.







