ఇంద్ర కీలాద్రిలో భవాని దీక్ష విరమణ.. ఎప్పుడంటే..

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.దాదాపు భవాని దీక్ష విరమణ కు 7 లక్షల మంది భవాని భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

 Bhavani Deeksha In Indra Keeladri When , Indra Keeladri, Bhavani Deeksha, Vmc Ho-TeluguStop.com

ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.డిసెంబర్ 15 నుంచి 19 వరకు భవాని దీక్షల విరమణ ఉంటుందని దుర్గామాత గుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.15వ తేదీ ఉదయం 6 గంటలకు విరమణ ప్రారంభం కానుంది.ఇంకా చెప్పాలంటే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దుర్గామాత దర్శనం భక్తులకు కల్పించే అవకాశం ఉంది.

భవానీ దీక్ష విరమణ మొదటి రోజున ఉదయం 6 గంటలకు హోమగుండం అగ్ని ప్రతిష్టతో అమ్మవారి దర్శనం మొదలవుతుందని చెబుతున్నారు.డిసెంబర్ 19న ఉదయం 6:30 కు మహా పూర్ణహృతి నిర్వహిస్తామని ఈవో తెలిపారు.గతంలో పోల్చితే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా ఈవో చెబుతున్నారు.భక్తులు ఘాట్ రోడ్డుపై క్యూ లైన్ లో వచ్చి హోమగుండంకు చేరుకునేలా ఏర్పాటులు చేస్తున్నామని చెబుతున్నారు.

భక్తుల సౌకర్యం దృష్ట 100 రూపాయలు 300 రూపాయలు 500 రూపాయల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు కూడా తెలిపారు.

500 టికెట్లతో భక్తుల కోసం విఎంసి హోల్డింగ్ ఏరియా మరియు మోడల్ గెస్ట్ హౌస్ నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉండే అవకాశం ఉంది.వారు ఓం టర్నింగ్ వద్ద ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకునే వీలుంటుంది.భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నాడంతో అన్నదానం ప్యాకెట్ల రూపంలో అందించే అవకాశం ఉంది.

కనుక దుర్గా నగర్ లో 10, బస్టాండ్లో ఒకటి, రైల్వే స్టేషన్ లో ఒకటి చొప్పున ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము అని తెలిపారు.దాదాపు 20 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామని, 15 లక్షల వాటర్ ప్యాకెట్లను ఏర్పాటు చేశామని వివరించారు.

అంతేకాకుండా 20 వైద్య శిబిరాలను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube