అలీ కూతురి పెళ్లి వీడియో మీరు చూశారా.. కూతురు ఎమోషనల్ అవ్వడంతో?

ప్రముఖ కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లి గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 Comedian Ali Wife Zubeda Ali Shares Daughter Fathima Marriage Video, Zubeda Ali-TeluguStop.com

పెళ్లికి హాజరు కాకపోయినా రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అలీ సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీగా ఉన్నారు.

అయితే ఫాతిమా పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియొను జుబేదా సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేశారు.

పెళ్లి తర్వాత తల్లీదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉండటంతో ఫాతిమా ఎమోషనల్ అయ్యారు.

పెళ్లికి సంబంధించి జరిగిన అన్ని కార్యక్రమాలను ఈ వీడియోలో ఉండేలా అలీ జాగ్రత్తలు తీసుకున్నారు.అలీ ఈ పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

డెకరేషన్ గ్రాండ్ గా చేయడంతో పాటు పెళ్లి కూతురి డ్రెస్ లో ఫాతిమా మరింత అందంగా కనిపించడం గమనార్హం.

ఫాతిమా స్నేహితులు, బంధువులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు.

మంత్రి రోజా కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు.అక్కినేని అమల, అక్కినేని నాగార్జున పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది.ఖర్చు విషయంలో అలీ ఏ మాత్రం రాజీ పడలేదని ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది.

ఈ యూట్యూబ్ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఫాతిమా కొన్ని క్షణాల పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ వీడియోకు కేవలం 9 గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫాతిమా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube