25 సంవత్సరాలు దాటిన ఏ ఒక్క అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఏ వేడుకలో కనిపించినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని చాలా మంది అడుగుతూ ఉంటారు.సరైన వయసులో వివాహం చేసుకోకపోతే తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు.
ప్రస్తుత సమాజంలో వివాహం కాని వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది.ముఖ్యంగా వృత్తిపరమైన కారణాల వల్ల వధువు( Bride ) లేదా వరుడి కోసం వెతకడం వల్ల వివాహం కూడా ఆలస్యమవుతుంది.
చాలా మంది జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుంటారు.అయితే కొంత మంది ఎంత ప్రయత్నించినా సరే వివాహం కాదు.

ముఖ్యంగా చెప్పాలంటే సంబంధాలు చూసేటప్పుడు దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.వివాహం( Marriage ) ఆగిపోయినట్లయితే ఈ నియమలను పాటించాలి.ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం రోజు దృష్టి లోపం ఉన్న వారికి సువాసన వస్తువులు, పరిమళ ద్రవ్యాలు దానం చేయాలి.
ఇలా చేయడం వల్ల త్వరలో వైవాహిక సుఖం లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే వివాహ మార్గంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ప్రతి రోజు సాయంత్రం ఇంటికి నైరుతి దిశలో మల్లెపూల నూనె దీపం( Jasmine oil lamp ) వెలిగించడం వల్ల వివాహానికి ఆటంకాలు దూరం అయిపోయి, త్వరగా వివాహం జరుగుతుంది.

ఇంకా చెప్పాలంటే వివాహం కానీ అబ్బాయిలు అయితే శుక్ల పక్షం మొదటి గురువారం రోజు ఒక పాత్రలో రెండు మల్లెపూలు, ఐదు మిఠాయిలు వేసి నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి సమర్పించాలి.ఇంకా చెప్పాలంటే శుక్ల పక్షం మొదటి శుక్రవారం మార్కెట్ నుంచి రెండు ముత్యాలను కొనుగోలు చేయాలి.వాటిలో ఒక దానిని ఏడు సార్లు చుట్టి ప్రవహించే నదిలోకి విసిరేయండి.మీతో ఎల్లప్పుడూ మరొక ముత్యాన్ని ఉంచుకోవాలి.ఇలా చేస్తే త్వరలో వివాహం జరుగుతుంది.