కొన్ని దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నా, కేవలం 30లోపు సినిమాలు మాత్రమే చేశాడు మహేష్ బాబు.( Mahesh Babu ) ఎందుకంటే ఈ టాలీవుడ్ ప్రిన్స్ సినిమాలను ఎంచుకోవడంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడు.
అవకాశాలు వస్తున్నాయి కదా అని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకొని సంవత్సరానికి నాలుగు, ఐదు చేయడానికి అస్సలు ఇష్టపడడు.తీసే ప్రతి సినిమా కొత్తగా ఉండాలని తపన పడతాడు.
అభిమానులకు తన సినిమాలతో కొత్త అనుభూతిని అందించాలని పరితపిస్తాడు.అందుకే మహేష్ బాబుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మహేష్ సాధారణంగా తనకు నచ్చితే ఒకరిని బాగా నమ్ముతాడు.కానీ తన నమ్మకాన్ని ఒక్కసారి వమ్ము చేస్తే మళ్లీ నమ్మేందుకు చాలా టైమ్ పడుతుంది.ఉదాహరణకు “అతడు” సినిమా( Athadu Movie ) కథ విన్నప్పుడు మహేష్ త్రివిక్రమ్ ని బాగా నమ్మాడు.త్రివిక్రమ్ చాలా లేట్ చేసిన సరే ఒకసారి నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి త్రివిక్రమ్ తో మూవీ చేశాడు.
ఇక కెరీర్ తొలినాళ్లలో తమిళం దర్శకుడు ఎస్ జే సూర్యతో( Director Sj Surya ) కలిసి నాని సినిమా( Nani Movie ) తీశాడు.దానిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ మూవీ ఫ్లాప్ అయింది.
ఈ దెబ్బ వల్ల మళ్లీ తమిళ దర్శకుడిని నమ్మడానికి మహేష్ బాబుకు ఏకంగా 13 ఏళ్ల పట్టింది.

అయితే ఆ నమ్మకాన్ని కూడా మరో తమిళ దర్శకుడు నిలబెట్టుకోలేకపోయాడు.అతడు మరెవరో కాదు గజినీ, సెవెంత్ సెన్స్ వంటి గొప్ప సినిమాలు తీసిన ఏ.ఆర్ మురుగ దాస్.( AR Murugadoss ) 2017లో ఏ.ఆర్ మురుగ దాసుతో కలిసి మహేష్ స్పైడర్ మూవీ( Spyder Movie ) చేశాడు.అది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.ఈ విధంగా తమిళ డైరెక్టర్ లతో చేసిన నాని, స్పైడర్ రెండు సినిమాలు కూడా మహేష్ బాబు కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి.
అందువల్లే అతను తమిళ డైరెక్టర్ తో సినిమా చేయాలంటే బాగా భయపడిపోతాడు.

ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.చాలామంది కష్టపడాలి, ఇక ప్రేక్షకులు కూడా సినిమా చూసి బాగా నష్టపోతారు, ఇవన్నీ జరగకూడదని మహేష్ ఆచితూచి సినిమాలు చేస్తుంటాడు.తమిళ దర్శకులు( Tamil Directors ) తాను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు కాబట్టి ప్రస్తుతానికి మహేష్ అయితే తెలుగు దర్శకులు మీదే పూర్తిగా ఆధారపడుతున్నాడు.
ఈ హీరో ప్రస్తుతం గుంటూరు కారం( Guntur Karam ) సినిమాలో నటిస్తున్నాడు.దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు.