యూఎస్ కౌంటీ బోర్డు ఎన్నికల బరిలో భారతీయురాలు.. ఏకంగా బైడెన్ మద్ధతు

అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే గవర్నర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, సెనేటర్లుగా, మేయర్లుగా సత్తా చాటుతున్నారు.

 Indian-muslim Woman Running For Dupage County Board Election In Us , Indian-musl-TeluguStop.com

అలాంటి దశలో ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు.ఆవిడ స్పూర్తితోనే పలువురు ప్రవాస భారతీయులు రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన ముస్లిం మహిళ సబా హైదర్ ఇల్లినాయిస్‌ లోని డ్యూపేజ్ కౌంటీ నుంచి రాష్ట్ర బోర్డు ఎన్నికల బరిలోకి దిగారు.ఆమెను స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయగా.

డెమొక్రాటిక్ పార్టీ టికెట్ ఇచ్చింది.

సబా హైదర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ .అమెరికాలో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా, చిన్న వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తనకిష్టమైన రంగంలో ఆమె దూసుకెళ్తున్నారు.

హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో దశాబ్థకాలంగా సబా తన వ్యాపారాన్ని నడుపుతున్నారు.చికాగో ల్యాండ్ ఏరియా నుంచి కార్పోరేట్ క్లయింట్లు, స్థానిక వ్యాపార సంస్థలకు ఆమె వెల్‌నెస్ కన్సల్టింగ్ సేవలను అందిస్తోంది.

ఇక కోవిడ్ సమయంలో సబా హైదర్ తన సామాజిక సేవతో ఎంతోమందిని ఆదుకున్నారు.ఈ ఏడాది నవంబర్ 6న జరగనున్న కౌంటీ బోర్డు ఎన్నికల్లో తమ సభ్యులను ఎన్నుకునేందుకు పది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

రాష్ట్ర స్థాయి బోర్డు నేరుగా రాష్ట్రంలోని ప్రజా సంక్షేమ విధానాలను రూపొందిస్తున్నందున ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.రాష్ట్ర స్థాయి బోర్డులో 19 మంది సభ్యులు వుండగా.

వారిలో 11 మంది డెమొక్రాట్లే.

Telugu Chicago Area, Democratic, Dupagecounty, Illinois, Indian, Joe Biden, Saba

2007లో అమెరికాలో అడుగుపెట్టిన సభా హైదర్ .తొలుత ఎంప్లాయిమెంట్ కన్సల్టెంట్‌గా, యోగా టీచర్‌గా పనిచేశారు.ఇతర జిల్లాల నుంచి అదే ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమొక్రాటిక్ పార్టీ మిత్రపక్షాలకు చెందిన సాదియా కోవర్ట్, డాన్ డెసర్ట్‌లు కూడా సభా హైదర్‌కు మద్దతుగా నిలిచారు.

ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే.డిసెంబర్‌లో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న డెమొక్రాట్ నేత అమీ షావెజ్ స్థానంలో నియమితులవుతారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube