Anitha Chowdary : కెరీర్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన అనితా చౌదరి.. అప్పుడు ఒత్తిడికి లోనయ్యానంటూ?

తెలుగు ప్రేక్షకులకు నటి,యాంకర్ అనిత చౌదరి( Anitha chowdary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె యాంకర్ గానే కాకుండా సినిమాలలో అలాగే సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడంతో పాటు ప్రేక్షకులకు బాగా చేరువ అయింది.

 I Missed So Many Good Movies On That Time Says Anitha Chowdary-TeluguStop.com

ప్రస్తుతం ఈమె అడపాదడపా సినిమాలలో నటిస్తూనే సీరియల్స్ లో నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత చౌదరి తన కెరియర్ గురించి పని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అంతేకాకుండా తన కెరియర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు కష్టాల గురించి వెల్లడించింది.

Telugu Tholi Prema, Anitha Chowdary, Tollywood, Tv Serials-Movie

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.అనుకోకుండా నేను ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను.మంచి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించగలిగాను.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా( Tholi Prema )లో హీరో సోదరి పాత్రలో నటించే అవకాశం మొదటి నాకే వచ్చింది.కానీ ఆ సమయంలో నేను ఒక సీరియల్ లో నటిస్తున్నాను అందుకే ఆ ఆఫర్ ని వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది అనిత చౌదరి.

అనంతరం ఆమె సీరియల్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం గురించి మాట్లాడుతూ.నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినందుకు పలు సందర్భాల్లో బాధపడ్డాను.నేను ఎప్పుడూ నిర్మాతగా మారాలని ప్లాన్‌ చేయలేదు.

Telugu Tholi Prema, Anitha Chowdary, Tollywood, Tv Serials-Movie

మా ఇంట్లో వాళ్లకు కూడా ఇష్టం లేదు.కాకపోతే, స్నేహితులు కోరడంతో నిర్మాతగా వచ్చాను.ప్రొడెక్షన్‌కు సంబంధించిన అన్ని పనులను నేను దగ్గరుండి చూసుకునేదాన్ని.

దాంతో ఆ సమయంలో మంచి మంచి సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది అని తెలిపింది అనిత. శతమానం భవతి సినిమా( Shatamanam Bhavati )ను కూడా వదులుకున్నాను.

ఆ తర్వాత ఎన్నో నష్టాలు కూడా చూశాను.అప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను అని చెప్పుకొచ్చింది అనిత చౌదరి.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా అనిత చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube