మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ క్రమంలో ఆయనను పార్టీలోకి ఖర్గే ఆహ్వానించారు.
అయితే ఇవాళ ఉదయమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తుమ్మల రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ పంపించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న తుమ్మల రాజీనామా చేశారు.సాయంత్రం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తుమ్మల భేటీకానున్నారు.
కాగా సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ తాజ్ కృష్ణలో ఉన్న సంగతి తెలిసిందే.అయితే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ఇవాళ, రేపు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి.







