మెగా ఇంట్లో సంబరాలు అంటే అంబరాన్ని అంటుతాయనే విషయం మనకు తెలిసిందే.ఏ చిన్న వేడుక అయిన మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు.
ఇలా ప్రతి వేడుకను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే మెగా ఫ్యామిలీ ఈసారి సంక్రాంతి( Sankranthi ) పండుగను మరింత ఘనంగా జరుపుకున్నారు.ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరులోని తమ ఫామ్ హౌస్ కి వెళ్లి మూడు రోజులపాటు అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా వీరి సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నిటిని కూడా మెగా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.అయితే నిహారిక ( Niharika ) తాజాగా మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈమె తన అక్కయ్యలు అలాగే తన వదినతో కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు .అలాగే సాయి తేజ్, వైష్ణవ్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ముఖ్యంగా నటి లావణ్య త్రిపాటికి( Lavanya Tripati ) ఇది మొదటి సంక్రాంతి పండుగ కావటం విశేషం.ఇక ఈమె తన ఆడపడుచులు అయినటువంటి నిహారిక సుస్మిత( Sushmitha ) కొణిదెల కలిసి ఎంతో సరదాగా గడిపారు.వారిద్దరితో కలిసి వంట చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.అదేవిధంగా నిహారికతో కలిసి ఈమె డాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ ఫోటోలు వీడియోలు అన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి లావణ్య త్రిపాఠి కుటుంబం సంతోషం రెండు ఒకే చోట చేరితే ఇలానే ఉంటుంది అంటూ చెప్పకు వచ్చారు.గత కొంతకాలంగా మెగా హీరోతో ప్రేమలో ఉన్నటువంటి ఈమె కథ ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా మెగా కోడలిగా అడుగుపెట్టిన తర్వాత లావణ్య త్రిపాఠి కూడా మెగా కుటుంబ సభ్యులందరితో కలిసిపోయి ఎంతో సరదాగా గడుపుతున్నారు.ఇక ఈ సంక్రాంతి పండుగ కూడా మెగా ఆడపడుచులతో కలిసి లావణ్య త్రిపాఠి సంతోషంగా జరుపుకున్నారని తెలుస్తోంది.







