దేశంలోని చాలామంది తల్లీదండ్రులు పిల్లల విషయంలో ఎంతో కేరింగ్ గా ఉంటారు.పిల్లల ఫుడ్ విషయంలో తల్లీదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే పిల్లలు ఇతర ఆహారాల కంటే స్నాక్స్ ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే.అయితే స్నాక్స్ తినడం వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.
మార్కెట్ లో ఉన్నా స్నాక్స్ ( Snacks )లో ఎక్కువ స్నాక్స్ కొత్త ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే అహనా( Ahana ) అనే యువతి మాత్రం రుచిగా ఉంటూనే ఆరోగ్య ప్రయొజనాలు చేకూర్చే స్నాక్స్ ను తయారు చేస్తూ సత్తా చాటుతున్నారు.రాజస్థాన్ ( Rajasthan )రాష్ట్రంలోని భరత్ పూర్ కు చెందిన అహనా ఐఐటీ ముంబై నుంచి బీటెక్( IIT Mumbai ), హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి తర్వాత రోజుల్లో ప్రముఖ సంస్థలలో జాబ్ చేశారు.విదేశాల్లో కూడా పని చేసిన అహనా బిజినెస్ గురించి ఆలోచన వచ్చిన వెంటనే రాజీనామా చేసి ఇండియాకు వచ్చేశారు.

మైదా, రసాయనాలు, కృత్తిమ రంగులు లేని స్నాక్స్ తయారు చేయాలని భావించిన అహనా మొదట కుకీలను తయారు చేసి 30 రకాల స్నాక్స్ ను అందుబాటులోకి తెచ్చారు.తొలి ఏడాది 3 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని అదే సమయంలో లాక్ డౌన్ వచ్చిందని ఆమె తెలిపారు.2021 సంవత్సరంలో అమ్మ చనిపోయిందని అమ్మ దహన కార్యక్రమాలు పూర్తైన రెండో రోజే ఇన్వెస్టర్లతో మీటింగ్ ఉందని తెలిపారు.

బాధను అణచుకుని మీటింగ్ కు హాజరై ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.అమ్మ నన్ను అన్నయ్యతో సమానంగా పెంచిందని అహనా అన్నారు.తన సంస్థలో పని చేస్తున్న వాళ్లలో ఎక్కువమంది అమ్మలే అని ఆమె తెలిపారు.
అహనా సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.







