తెలుగు సినిమాకి కామెడీ బ్రహ్మగా ఎన్నో సినిమాలు తీశారు జంధ్యాల.నవ్వడం ఒక భోగం నవ్వించక నవ్వకపోవడం ఒక రోగం అంటారు ఆయన.చాలామంది దర్శకులు తాము అంత గొప్ప హీరోని పరిచయం చేసాం లేదా ఈ స్టార్ హీరోయిన్ నేనే పరిచయం చేశాను అంటూ గొప్పగా చెప్పుకుంటారు.కానీ జంధ్యాల నుంచి అనేకమంది కమెడియన్ వచ్చి ఎంతో గొప్పగా పేరు సంపాదించుకుంటున్నారు.300 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన జంధ్యాల ఆయన కెరియర్ మొత్తంలో 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.జంధ్యాల కన్నుమూసిన తర్వాత ఆయన కుటుంబం నుంచి వారసులుగా తామున్నాము అంటూ ఎవ్వరు బయటకు రాలేదు.
ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

కానీ ఇటీవల ఒక మీడియా సంస్థ కు జంధ్యాల భార్య అన్నపూర్ణమ్మ జంధ్యాల గురించి, ఆయన కుటుంబం గురించి అనేక విషయాలు బయటకు తెలిసాయి.జంధ్యాల సినిమాలు తీస్తున్న క్రమంలో ఆయన మేనల్లుడైన ప్రదీప్ ని పరిచయం చేశారు.ఎస్పీ బాలసుబ్రమణ్యం జంధ్యాల మంచి ప్రాణ స్నేహితులు.
చెన్నైలో వీరి ఇల్లులు పక్కపక్కనే ఉండేవి.అలాగే జంధ్యాలకు పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులు ఏవి దక్కకపోవడంపై సదరు యాంకర్ ప్రశ్నించగా ఆయనే లేరు, ఆయనకు ఎలాంటి అవార్డు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అవార్డుల విషయంలో మాకు ఎలాంటి ఆసక్తి లేదు అంటుకుండ బద్దలు కొట్టారు అన్నపూర్ణమ్మ.

ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి కేవలం కొన్ని గంటల ముందు అంటే నాలుగు రోజుల ముందు తనతో మాట్లాడారని, చెన్నైలో గల మా ఇంట్లో ఒక వ్యక్తి అద్దె కు ఉంటూ ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతుండడంతో, ఆ విషయం ఆయనతో మాట్లాడానని, దాంతో బాలసుబ్రమణ్యం గారే మనిషిని పెట్టించి మరి దగ్గర ఉండి ఖాళీ చేయించి మా ఇల్లును మాకు అప్పగించారంటూ చెప్పుకొచ్చారు.అలాంటి వ్యక్తి మరణం తర్వాత కరోనా కారణంగా కనీసం చివరి చూపు కూడా చూసుకోలేకపోయామని అన్నపూర్ణమ్మ బాధపడ్డారు.