గల్లీ క్రికెట్ నుండి ఐపీఎల్ కు ఎంట్రీ.. తొలి మ్యాచ్ లో ఏకంగా 3 వికెట్లు..!

తాజాగా కలకత్తా- బెంగుళూరు( KalKatta-Bangalore ) మధ్య జరిగిన మ్యాచ్ లో సుయాష్ శర్మ( Suyash Sharma ) సరికొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.19 ఏళ్ల సుయాష్ శర్మ తొలిసారి ఐపీఎల్ లో కలకత్తా జట్టులోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎంట్రీ ఇచ్చాడు.అయితే గతంలో ఫస్ట్ క్లాస్, లిస్టు- ఏ, టీ 20 లాంటి మ్యాచులు ఆడలేదు.గల్లీ క్రికెట్ ఆడే సుయాష్ శర్మ నేరుగా ఈ ఐపీఎల్ సీజన్లో అడుగుపెట్టి మొదటి మ్యాచ్లో మూడు వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు.

 Entry To Ipl From Gully Cricket3 Wickets In The First Match , Suyash Sharma , Ka-TeluguStop.com

గురువారం కలకత్తా- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో కలకత్తా 81 పరుగుల తేడాతో బెంగళూరు పై ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన కలకత్తా జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.205 పరుగుల లక్ష్య చేదనకు దిగిన బెంగుళూరు జట్టుకు కలకత్తా జట్టు బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, సునీల్ నరైన్ లు గ్రౌండ్లో చుక్కలు చూపించారు.

వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ తో 4 వికెట్లు తీశాడు.ఇక తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సుయాష్ శర్మ మూడు వికెట్లు, సునీల్ నరైన్( Sunil Narine ) 2 వికెట్లు, శార్దూల్ ఠాగూర్( Shardul Tagore ) ఒక వికెట్ తో బెంగుళూరు జట్టును ఆల్ అవుట్ చేసి కలకత్తా జట్టుకు విజయం అందించారు.ప్రస్తుతం మొదటి మ్యాచ్ లోనే మూడు వికెట్లు తీసిన సుయాష్ శర్మ అందరి దృష్టిలో పడి.అందరి ప్రశంసలు పొందాడు.కలకత్తా ఫ్రాంచైజీ ఈ ఢిల్లీ కుర్రాడిని రూ.20 లక్షలు వేచించి కొనుగోలు చేసింది.తాజాగా బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ స్థానంలో బరిలోకి దిగాడు.

కలకత్తా జట్టు కెప్టెన్ నితీష్ స్పందిస్తూ.సుయాష్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ, అందుకే జట్టు అతని బౌలింగ్ పై పూర్తి నమ్మకం ఉంచి బౌలింగ్ అవకాశం ఇస్తే అద్భుత ఆటను ప్రదర్శించాడని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube