సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ఏదో ఒక క్రాఫ్ట్ లో సెటిల్ అవ్వాలని చూస్తారు ముఖ్యం గా పాటలు పాడే సింగెర్స్ కి ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది అయితే ఒకప్పుడు తన గాత్రం తో చాలా సాంగ్స్ ప్రాణం పోసిన సింగర్ కౌసల్య( Singer Kousalya ) గురించి మనందరికీ తెలిసిందే.ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా లో( Itlu Shravani Subramaniam movie ) ఆమె పాడిన మల్లి కూయవే గువ్వా.
మోగిన అందెల మువ్వా, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలోని రా రమ్మని రారా రమ్మని అంటూ తన మధురమైన గాత్రంతో అద్భుతమైన పాటలు పాడారామె.ముఖ్యంగా సంగీత దర్శకుడు చక్రి కంపోజిషన్‌లో పాడిన పాటలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాటలూ ఆమె పాడారు.అప్పట్లో సింగర్‌గా ఒక వెలుగు వెలిగిన కౌసల్య.వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తాజాగా ఆమె వాటి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు .తన కొడుకును దృష్టిలో పెట్టుకుని భర్త పెట్టే బాధలను తాను సర్దుకుపోయేదాన్నని కౌసల్య చెప్పారు.బాబు అప్పటికి చిన్నవాడు.
చిన్న పిల్లలకు తండ్రి, తల్లి.రాజు, రాణి.

ప్రతి పిల్లాడు నాన్నను చూసి పెరుగుతాడు. నాన్నను చూసి స్ఫూర్తి పొందుతాడు.కానీ, అమ్మ దగ్గర పెరిగితే వాడు ఎలా తయారవుతాడు అనే విషయంలో నాకు స్పష్టతలేదు.అందుకే బయటికి రాలేకపోయా.నాన్న అవసరం వాడికి చాలా ఉందని నేను భరించా.నా భర్త నా నుంచి విడిపోయేటప్పటికి నా కొడుకు వయసు ఆరేళ్లు.
అంతకు ముందు ఇవన్నీ నేను అనుభవించాను అని కౌసల్య వివరించారు.భర్త నుంచి తాను విడిపోవాలని ఏ రోజూ అనుకోలేదని.కాకపోతే అతడు వేరే మహిళను వివాహం చేసుకోవడంతో తనను వదిలిపెట్టి వెళ్లిపోయాడని కౌసల్య చెప్పారు…

ఇక నువ్వెందుకు ఈ వేలు కు ఉంగరం పెట్టుకుంటున్నావు, ఈ వేలుకు ఉంగరం ఉంటే పెళ్లయినట్టు, తీసేయ్.అప్పుడే నీ జీవితంలో ఒక మంచి మనిషి వస్తారు అని నా కొడుకు అంటాడు… ఇప్పుడు వాడికి 18 ఏళ్లు.నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటాడు.నువ్వొక్కదానివే బతకాలని ఎవ్వరూ చెప్పలేదు, నువ్వు త్యాగం చేయాల్సిన అవసరంలేదు, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన త్యాగం చాలు, ఇప్పుడు నేను పెరిగాను, నీ గురించి ఆలోచించు, జీవితాన్ని ఎంజాయ్ చేయి, నిన్ను బాగా చూసుకునేవాడు రావాలి అంటాడు అని తన కొడుకు కార్తికేయ ( Karthikeya )గురించి కౌసల్య చెప్పుకొచ్చారు.
తాను జీవితంలో పడిన బాధలన్నింటికీ ఇప్పుడు తన కొడుకు విరుగుడు అని కౌసల్య తెలిపారు….








