ఎల్లో దంతాలు తెల్లగా మారాలంటే ఏం చేయాలి ?

లెక్కలు అడగొద్దు కాని, ప్రతి ముగురిలో ఒకరినైనా పసుపు రంగు దంతాల సమస్య ఇబ్బంది పెడుతుంది.తెల్లగా ఉండాల్సిన దంతాలు ఇలా పచ్చగా ఎందుకు మారతాయి అంటే కారణాలు అనేకం.

 Super Home Remedies For Yellow Teeth-TeluguStop.com

సమస్య తీవ్రత దాల్చెంతవరకు జాగ్రత వహించకపోవడమో, ఆహారపు అలవాట్ల వలనో ఇలా జరుగుతుంది.కారణాలు అప్రస్తుతం కాని, ఈ సమస్యకి ఇంట్లో ఉండే పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం.

* ఆపిల్ సీడెడ్ వెనిగర్ అనేది డాక్టర్లు మెచ్చిన క్లీన్సేనర్.దంతాలపై ఉన్న మచ్చలను పోగొట్టేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

రోజు బ్రష్ చేసుకోవడానికి ముందు కొంచెం ఈ వెనిగర్ తో దంతాలను శుభ్రం చేసుకోండి.

ఓ నెల నెలన్నర క్రమం తప్పకుండా ఇలా చేస్తే, మంచి ఫలితాలు కనిపిస్తాయి.

* సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ఆరెంజ్ డైరెక్ట్ గా వాడితే సున్నితమైన దంతాలకి నొప్పి కలగవచ్చు.కాబట్టి రసం కాకుండా, పీల్ ని వారంలో ఒకటి రెండు సారి వాడుతూ దంతాలను శుభ్రం చేసుకోండి.

* ఆయిల్ పుల్లింగ్ అనే టెక్నిక్ మంచి ఫలితాలను ఇస్తుంది.కాని ఆయిల్ డాక్టర్ ని సంప్రదించి వాడాలి.

కోబరినూనే నేచురల్ ఆయిల్స్ లో అందరు చెప్పే చాయిస్.

* మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందంటే, మా పేస్ట్ లో ఉండి అని డబ్బా కొడతాయి కంపెనీలు.

వారి టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో, మన ఇంట్లో అయితే ఉందిగా.మరి అలసత్వం ఎందుకు .వాడండి.

* బేకింగ్ సోడా, హైడ్రోజెన్ పెరాక్సైడ్ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని వాడితే దంతాలు తెల్లబడటం ఖాయం అని చెబుతున్నాయి పరిశోధనలు.

* తులసి ఆకులు కేవలం దంతాలను శుభ్రపరచడమే కాదు, గమ్ ప్రాబెల్స్ ని కూడా అరికడతాయి.ఎలాంటి అభ్యంతరం లేకుండా వాడండి.

* బొగ్గు మీద ఏ టూత్ పేస్ట్ పనికి రాదు.ఈ విషయాన్ని మీ బామ్మని అడిగితే చెబుతుంది.

చులకనగా అనిపిస్తే, టూత్ పేస్ట్ తో కలిపి వాడుకోండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు