ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ పతనం మొదలైంది కాకినాడ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

కాకినాడలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర రోడ్ షో( Varahi Vijaya Yata )లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మండి పడటం జరిగింది.

 Pawan Kalyan's Serious Comments On Dwarampudi Chandrasekhar Reddy, Janasena,pa-TeluguStop.com

స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్యమంత్రి అండ చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్యే తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టు ఉందని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో. జనసేన పార్టీ( Janasena Party )కి చెందిన వీర మహిళలు మరియు కార్యకర్తలపై ద్వారంపూడి అనుచరులు చెయ్యి చేసుకున్న ఘటనని ఉద్దేశించి.

మండిపడ్డారు.ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో ద్వారంపూడినీ   గెలవనివ్వను.

నీ పతనం మొదలైంది.నీ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు… నా పార్టీ జనసేన కాదు అంటూ తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

Telugu Ap, Janasena, Kakinadavarahi, Pawan Kalyan-Telugu Political News

మీ తాతకు బేడీలు వేసి లక్కేళ్ళినట్లు నీకు కూడా రాబోయే రోజుల్లో భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( Dwarampuudi Chandrasekhar Reddy ) పై ఢిల్లీలో ఓ ఫైల్ ఓపెన్ అయింది అని సంచలన ఆరోపణలు చేశారు.అనేక కబ్జాలు ఇంకా అవినీతి.దోపిడీ కార్యక్రమాలు మరియు బియ్యం స్మగ్లింగ్ ద్వారా దాదాపు 15 వేల కోట్ల రూపాయలు.ఈ ఎమ్మెల్యే సంపాదించారని పవన్ మండిపడ్డారు.రెండున్నర సంవత్సరాల క్రితం నాపై ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు.

అదే సమయంలో ద్వారంపూడి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు మన పార్టీ కార్యకర్తలు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేశారు.ఆ ఘటనను నేను మర్చిపోలేదు.

కచ్చితంగా చెబుతున్న రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలను విడిచిపెట్టి వెళ్ళను.ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలవనివ్వను అంటూ కాకినాడ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube