జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయంగా వ్యవహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు .ప్రస్తుత ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామ్యంగా ఉండడం, ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో తాను ఉండడంతో, పాలనలోనూ తన మార్క్ కనిపించే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారు.
దీంతోపాటు క్షేత్రస్థాయిలో జనసేన ను బలోపేతం చేసి, తమ రాజకీయ శత్రువు జగన్ ను, వైసీపీని( YCP ) బలహీనం చేసే విధంగా పవన్ సరికొత్త ప్లాన్ ను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందినా . 40% ఓట్ షేర్ ఆ పార్టీకి ఉంది .
ఉమ్మడి 13 జిల్లాల్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండడం, ఏపీలో 100కు పైగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ , జడ్పీ చైర్మన్ పదవులు వైసిపి చేతిలోనే ఉన్నాయి .వార్డ్ మెంబర్ల నుంచి సర్పంచులు , ఎంపీటీసీలు, జెడ్పీటీసి లు నూటికి 80 మంది వరకు ఉన్నారు పార్టీ తరపున ఎమ్మెల్యే లు పెద్దగా గెలవకపోయినా , మండల, గ్రామస్థాయిలో వైసీపీకి బలం ఉండడం, గ్రామ స్థాయి లో తమకు పట్టు ఉండడం, వైసిపి నే బలహీను చేయాలని టిడిపి జనసేన నిర్ణయించుకున్నాయట.
సర్పంచ్ లు, ఎంపీటీసీలు , జడ్పీ చైర్మన్( ZP Chairman ) లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ ను సిద్ధం చేసుకుంటున్నారు.గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వాటిని దారి మళ్లించి ఇతర పథకాలకు మళ్లించారని , పాలనలో తమ జోక్యం లేకుండా తమను ఉత్చవ విగ్రహాలుగా మార్చేసారు అనే బాధ వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పిటిసి లను ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకునే విషయం పైనే జనసేన , టీడీపి ( Janasena, TDP )లు ఫోకస్ చేశాయి.గ్రామ స్థాయి లోని వైసీపీ క్యాడర్ తో పాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను జనసేన లో చేర్చుకుని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యే ల తోపాటు, నియోజకవర్గ స్థాయిలో కీలకంగా ఉన్న నాయకులు టిడిపిలోకి వెళ్లే విధంగా పవన్ వ్యూహరచన చేస్తున్నారట.