ఏపీలో పథకాలకు పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఇవే 

గత వైసిపి ప్రభుత్వ హయంలో ప్రతి పథకం పేరు ను తన పేరుతో ఉండేలా అప్పటి సీఎం జగన్ పెట్టుకోవడంతో,  అప్పట్లోనే టిడిపి,  జనసేన పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఏపీలో టిడిపి,  జనసేన,  బిజెపి కూటమి అధికారంలో ఉండడంతో , పూర్తిగా జగన్( YS Jagan Mohan Reddy ) పాలన ఆనవాళ్లను చెరిపి వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

 The Names Of The Schemes In Ap Have Changed These Are The New Names, Jagan, Ysrc-TeluguStop.com

ప్రతి విషయంలోనూ పారదర్శకత ఉండేలా,  ప్రజలకు మేలు చేసే విధంగా టిడిపి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ మేరకు ఏపీలోని అన్ని వ్యవస్థ లను ప్రక్షాళను చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

దీనిలో భాగంగానే గత వైసిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telugu Ap, Chandrababu, Jagan, Lokeshap, Telugudesham, Ysrcp-Politics

గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు పేర్లను మార్చి గొప్ప వ్యక్తుల పేర్లను పెట్టినట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  ఈ మేరకు ఏపీ ఐటీ,  విద్యాశాఖల మంత్రి నారా లోకేష్( Nara lokesh ) ఈ విషయాన్ని వెల్లడించారు.  ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు ప్రకటించింది అని మండపడ్డారు.

అందుకే సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.ఈ మేరకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలోని విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించామని,  దీనిలో భాగంగానే ముందుగా వైసీపీ ప్రభుత్వం లో అప్పటి సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లతో మార్చుతున్నట్లు లోకేష్ వెల్లడించారు .

Telugu Ap, Chandrababu, Jagan, Lokeshap, Telugudesham, Ysrcp-Politics

 దేశానికి సేవలు అందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలు పెడుతున్నామని వెల్లడించారు.జగనన్న అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనం( Talliki Vandanam )గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.  జగనన్న విద్యా కానుక పథకం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు.అలాగే జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కింద మార్చారు.

  మనబడి,  నాడు –  నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తు అని ,స్వేచ్ఛ అనే పథకాన్ని బాలికా రక్షక మర్చారు.అలాగే జగనన్న ఆణి ముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా పేరు మార్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube