ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్... రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ఒకరు.ఈయన నటించిన సినిమాలన్నీ ప్రస్తుతం తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

 Ranbir Kapoor Interesting Comments On Alia Bhatt , Ranbir Kapoor, Alia Bhatt, Ra-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్( Alia bhatt ) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రణబీర్ కపూర్ అలియా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సందర్భంగా అలియా గురించి ఈయన మాట్లాడుతూ.చిన్నప్పుడు నేను మా నాన్న గొంతు వింటే చాలా భయపడి పోయే వాడిని.

నాన్న మాట్లాడితే భయంతో వనికి పోయేవాడిని అంత గట్టిగా మా నాన్న స్వరం ఉండేది.అయితే ప్రస్తుతం ఆలియా భట్ గొంతు కూడా అంతే పెద్దదని ఈయన కామెంట్స్ చేశారు.

ఇలా గట్టిగా మాట్లాడితే నాకు నచ్చదని తెలుసుకున్న ఈమె నాకోసం తన టోన్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు.30 ఏళ్ల నుంచి ఉన్న ఆ టోన్ త్వరగా మార్చుకోవాలంటే చాలా కష్టమని ఈయన వెల్లడించారు.ఇక ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్ అని తెలిపారు.తనకు నాపై చాలా గౌరవం ఉందని ఎప్పుడు నన్ను నవ్వించడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు.తనతో కలిసి గడపడానికి తాను కూడా ఇష్టపడతానని అది వెకేషన్ కి వెళ్లడం అయిన ఇంట్లో కలిసి ఉండటం అయిన తనకు చాలా ఇష్టమని తెలిపారు.ఇక ఆమె ఎంతో తెలివైనది అలాగే తన పని పట్ల ఎంతో శ్రద్ధ చూపుతుంది అంటూ ఈ సందర్భంగా రణబీర్ తన భార్య నటి అలియా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube