అప్పుడు 736 రూపాయలు.. ఇప్పుడు రూ.350 కోట్లు.. సూర్య సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరో సూర్య( Suriya )కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సూర్య సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ కళకళలాడాల్సిందే.

 Star Hero Surya Inspirational Success Story Details Inside Goes Viral In Social-TeluguStop.com

సూర్య రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.సూర్యకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

అయితే సూర్య మొదటి వేతనం 736 రూపాయలు కాగా ఇప్పుడు అతని ఆస్తుల విలువ 350 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

Telugu Ghajini, Kanguva, Kollywood, Sivakumar, Story, Suriya-Movie

సూర్య సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా కంగువా సినిమా అంచనాలకు అందని స్థాయి బడ్జెట్ తో తెరకెక్కుతోంది.సూర్య తండ్రి శివకుమార్ పాపులర్ నటుడే అయినా కెరీర్ తొలినాళ్లలో సూర్య తండ్రి ఇమేజ్ కు భిన్నంగా ఏదైనా సాధించాలని అనుకున్నాడు.20 ఏళ్ల వయస్సులోనే మూవీ ఆఫర్ వచ్చినా సూర్య మాత్రం ఆ ఆఫర్ ను వద్దనుకున్నాడు.

Telugu Ghajini, Kanguva, Kollywood, Sivakumar, Story, Suriya-Movie

గార్మెంట్స్ బిజినెస్ లోకి వెళ్లిన సూర్య మొదట 736 రూపాయలకు ఒక క్లాత్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు.అయితే మణిరత్నం సూర్యతో సినిమా తీసి అతని జాతకాన్ని మార్చేశాడు.గజిని( Ghajini ), సింగం సిరీస్ సినిమాలతో సూర్య మంచి పేరును సంపాదించుకున్నారు.

సూర్య తన సినిమాలలో కొన్ని సినిమాలకు తనే నిర్మాతగా, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న సూర్య కంగువ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతారేమో చూడాలి.

కంగువా సిని( Kanguva )మా బింబిసార తరహాలో ఉంటుందని 1500 సంవత్సరాల క్రితం కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.సూర్యకు కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.

సూర్య మార్కెట్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube