అప్పుడు 736 రూపాయలు.. ఇప్పుడు రూ.350 కోట్లు.. సూర్య సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరో సూర్య( Suriya )కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

సూర్య సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ కళకళలాడాల్సిందే.

సూర్య రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.సూర్యకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

అయితే సూర్య మొదటి వేతనం 736 రూపాయలు కాగా ఇప్పుడు అతని ఆస్తుల విలువ 350 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

"""/" / సూర్య సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా కంగువా సినిమా అంచనాలకు అందని స్థాయి బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

సూర్య తండ్రి శివకుమార్ పాపులర్ నటుడే అయినా కెరీర్ తొలినాళ్లలో సూర్య తండ్రి ఇమేజ్ కు భిన్నంగా ఏదైనా సాధించాలని అనుకున్నాడు.

20 ఏళ్ల వయస్సులోనే మూవీ ఆఫర్ వచ్చినా సూర్య మాత్రం ఆ ఆఫర్ ను వద్దనుకున్నాడు.

"""/" / గార్మెంట్స్ బిజినెస్ లోకి వెళ్లిన సూర్య మొదట 736 రూపాయలకు ఒక క్లాత్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు.

అయితే మణిరత్నం సూర్యతో సినిమా తీసి అతని జాతకాన్ని మార్చేశాడు.గజిని( Ghajini ), సింగం సిరీస్ సినిమాలతో సూర్య మంచి పేరును సంపాదించుకున్నారు.

సూర్య తన సినిమాలలో కొన్ని సినిమాలకు తనే నిర్మాతగా, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న సూర్య కంగువ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతారేమో చూడాలి.

కంగువా సిని( Kanguva )మా బింబిసార తరహాలో ఉంటుందని 1500 సంవత్సరాల క్రితం కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

సూర్యకు కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.సూర్య మార్కెట్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ప్రభాస్ కల్కి సినిమాకి, సుమంత్ ‘మహేంద్ర గిరి వారాహి’ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?