ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు, ఎప్పుడు హీరోగా సినిమాలు చేస్తారో ఊహించలేం.అంతేకాదు ఏ యాక్టర్స్ ఏ సినిమాలో హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తారనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేం.
టాలీవుడ్ లో కొంతమంది కొన్ని మూవీల్లో హీరో హీరోయిన్లుగా జతకట్టి ఆశ్చర్యపరిచారు.ఆ యాక్టర్స్ ఎవరో, వాళ్లు కలిసి నటించిన సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి.
సుడిగాలి సుధీర్, దివ్య భారతి
నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు కామెడీ రొమాంటిక్ చిత్రం గోట్ (G.O.A.T) త్వరలోనే విడుదల కానుంది.ఈ చిత్రంలో హీరో సుడిగాలి సుధీర్, హీరోయిన్ దివ్య భారతి.తమిళంలో బ్యాచిలర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది నటి దివ్య భారతి.ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది.అలాంటి తార సుధీర్ కి జంటగా నటిస్తుందని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
సుధీర్ ఖచ్చితంగా ఏదో మచ్చ వేసుకొని పుట్టి ఉంటాడు అని కూడా కామెంట్లు చేశారు.
దివ్య భారతి ( Divya Bharathi)తమిళ సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది.ముగెన్ రావుతో కలిసి మధిల్ మేల్ కాదల్ (2022)లో నటించింది.2024లో తమిళ వెబ్ సిరీస్ చేరన్స్ జర్నీ, కింగ్స్టన్లో కనిపించింది.విజయ్ సేతుపతితో హిట్ చిత్రం మహారాజాలో కూడా చక్కగా యాక్ట్ చేసి మెప్పించింది.తమిళంలో దూసుకుపోతున్న ఈ తార ఊహించని విధంగా సుధీర్ తో జతకట్టి తెలుగు వారికి పరిచయం కావడానికి సిద్ధమైంది.
అలీ, సౌందర్య
కమెడియన్ అలీ చాలా సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.ఇక సహజ నటి సౌందర్య( Soundarya ) స్టార్ హీరోలతో నటించే తెలుగు సినిమా పరిశ్రమంలో చాలా మంచి పేరు తెచ్చుకుంది.అయితే ఆమె అలీతో నటిస్తుందని ఎవరూ ఊహించలేదు.కానీ శుభలగ్నం సినిమాలో వీరిద్దరూ ఒక పాటకు హీరో హీరోయిన్ల లాగా రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు.సునీల్, ఆర్తి అగర్వాల్అందాల రాముడు సినిమాలో సునీల్, ఆర్తి అగర్వాల్ కలిసి జంటగా నటించిన సంగతి తెలిసిందే.సునీల్ తో ఆర్తి రొమాన్స్ చేస్తుందని అంతకుముందు దాకా ఎవరూ కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఆర్తి చాలా పెద్ద హీరోలతో కలిసి నటించిన చరిత్ర కలిగి ఉంది.కానీ ఆమె సునీల్ సినిమాలో హీరోయిన్ గా నటించడంలో తప్పేం లేదు అనుకుంది.
అందుకే చేసింది.
సుహాస్, కీర్తి సురేష్
మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) చిన్న హీరో సుహాస్తో కలిసి “ఉప్పుకప్పురంబు” సినిమాలో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంది వీరిద్దరి కాంబినేషన్లో కూడా ఒక సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు.