నేడు పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ మేరకు ఆయనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా( Social media )లో షేర్ చేస్తూ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేయడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
ఇకపోతే మీరు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతుండగా తజన టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ కూడా తన బెస్ట్ విషెస్ ని తెలిపారు.పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని బన్నీ తన స్టైల్‌లో విషెస్ తెలిపారు.ఇటీవల అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు బహిరంగమైన సంగతి తెలిసిందే.తనకు ఇష్టమైన చోటికి వెళ్తానని అల్లు అర్జున్ కామెంట్ చేసి, పరోక్షంగా పవన్‌కు తన ఉద్దేశాన్ని వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది.
అలాగే బెంగళూరు పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్( Allu Arjun) గురించి ఘాటు కామెంట్స్ చేశారు.
ఇప్పుడు సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లర్లు హీరోలు అవుతున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పవన్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఒక రకమైన వార్ జరుగుతోంది.ఇలాంటి సమయంలో పవన్‌కు మర్యాద కోసం బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడం మరోసారి చర్చనీయాంశమైంది.
మరి ఇంతటితో అయినా అభిమానులు ఫ్యాన్స్ వారిని ఆపేస్తారో లేదో చూడాలి మరి.అయితే పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ విషయంలోకి ఇటీవల అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ( Kancharla Chandrasekhar Reddy )కూడా ఇన్వాల్వ్ అయి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించాలి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే.