Chiranjeevi: మెగా స్టార్ ని కూడా వదలని మిడిల్ డ్రాప్ కష్టాలు…..వీటిలో ఒక హాలీవుడ్ చిత్రం కూడా ఉందట!!

సినిమా రంగంలో కొన్ని సార్లు సినిమాలు మొదలై మధ్యలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది.కొన్ని సార్లు ఈ చిత్రాలు హీరోని మార్చొ, లేక డైరెక్టర్ని మార్చి మళ్ళి మొదలు పెడుతుంటారు.

 Middle Drops Of Megastar Chiranjeevi-TeluguStop.com

కానీ మరి కొన్ని చిత్రాలు మాత్రం పూర్తిగా అటకెక్కిపోతాయి.ఈ మిడిల్ డ్రాప్ కష్టాలకు ఎవ్వరు అతీతులు కారు.

చివరకు మన మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi ) కూడా.చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కు పైగా సినిమాలలో నటించారు.

ఐతే ఆయన మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయ్.అవేమిటో ఇప్పుడు చూద్దాం.

వినాలని ఉంది:

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో సినిమాలు చేసారు కానీ చిరంజీవితో ఒక సినిమా చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటారు చాలా మంది అభిమానులు.ఐతే ఈ క్రేజీ కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చేసారు కూడా.

చిరంజీవి హీరోగా, టబు,( Tabu ) ఊర్మిళ( Urmila ) హీరోయిన్ లు గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేసారు.కొంత షూటింగ్ కూడా జరిగింది.

కారణాలు ఏమిటో తెలీదు కానీ, ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.

Telugu Abubhagadad, Auto Johnny, Bhuloka Veerudu, Chiranjeevi, Vajrala Donga, Vi

అబూ బగ్దాద్ గజదొంగ:

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల వాలని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్ అనే పదాలు మనం వింటున్నాం.కానీ నిజానికి చిరంజీవి ఎప్పుడో పాన్ ఇండియా సినిమా తీయడానికి సిద్ధపడ్డారు.అబూ బగ్దాద్ గజదొంగ( Abu Bhagdad Gajadonga Movie ) చిత్రాన్ని అన్ని ప్రాంతీయ భాషలో విడుదల చెయ్యడానికి సన్నధాలు జరిగాయి.

ఈ చిత్రాన్ని విదేశాలలో కూడా విడుదల చేద్దామనుకున్నారు.ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు.కానీ ఈ చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది.

Telugu Abubhagadad, Auto Johnny, Bhuloka Veerudu, Chiranjeevi, Vajrala Donga, Vi

భూలోక వీరుడు:

అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అనౌన్స్ అయిన చిత్రం భూలోక వీరుడు.( Bhuloka Veerudu ) జానపద నేపథ్యంలో ఈ సినిమాను తీద్దామనుకున్నారట మేకర్స్.కానీ ఈ చిత్రం సెట్స్ పైకే వెళ్ళలేదు.

Telugu Abubhagadad, Auto Johnny, Bhuloka Veerudu, Chiranjeevi, Vajrala Donga, Vi

వజ్రాల దొంగ:

చిరంజీవి, శ్రీ దేవి కాంబోలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.ఐతే ఇదే కాంబోలో రామ్ రెడ్డి దర్శకుడిగా మరో చిత్రం కూడా మొదలయింది.ఈ చిత్రానికి పూజ కార్యక్రమం కూడా అయ్యిందట.కానీ ఆ తరువాత మధ్యలో ఆపేసారు.

Telugu Abubhagadad, Auto Johnny, Bhuloka Veerudu, Chiranjeevi, Vajrala Donga, Vi

ఆటో జానీ:

చిరంజీవి తో ఒక సినిమా చేయాలన్నది తన జీవిత ఆశయం అని చెప్తుంటారు పూరి జగన్నాథ్. ఐతే ఈ కల నిజమయినట్టే అయ్యి చెయ్యి జారిపోయింది.చిరంజీవి రాజకీయాలనుండి రిటైర్ అయ్యాక చేద్దమనుకున్న మొదటి చిత్రం ఆటో జానీ.( Auto Johnny ) అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్.

కానీ ఈ సినిమా కూడా సెట్ పైకి వెళ్ళలేదు.

మంచి లవ్ స్టోరీలు, కుటుంబ కథ చిత్రాలు తీసి విజయాలు అందుకున్న సక్సెసఫు డైరెక్టర్ ఆదిత్య.

ఆదిత్య, చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి.అంత ఒక అయ్యాక కూడా ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు.

శుభలగ్నం, ఆహ్వానం వంటి సువర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.వి.కృష్ణ రెడ్డి. ఈయన కూడా చిరంజీవి తో ఒక సినిమా చేద్దమనుకున్నారు.

కానీ ఈ చిత్రం కూడా పట్టాలెక్కలేదు.ఇలా చిరంజీవి తన కెరీర్ లో మిడిల్ డ్రాప్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube