శరీరానికి కేలరీలు పెరగకుండా ఆరోగ్యకరమైన ఆహారం ఏదని ఆలోచిస్తే మొదటగా సూప్స్ గుర్తుకు వస్తాయి.అయితే ఇప్పుడు చెప్పే గ్రీన్ పీస్, పుదీనా సూప్ తీసుకోవటం వలన ఎక్కువ సేపు కడుపు నిండిన భావన,ఆకలి తొందరగా వేయకపోవడం మరియు కేలరీలు తక్కువగా ఉండుట వలన ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ సూప్ ని లంచ్, డిన్నర్ ముందు తీసుకుంటే మంచిది.ఈ సూప్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కొలెస్టరాల్ తక్కువగా ఉండుట వలన బరువు తగ్గటానికి అద్భుతంగా పనిచేస్తుంది.
ఇప్పుడు ఈ సూప్ ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
పచ్చిబఠానీలు- 2 కప్పులు
బట్టర్- 1 స్పూన్
ఉప్పు : రుచికి సరిపడా
నీళ్ళు- 2 కప్పులు
ఉల్లిపాయలు- ¼ కప్పు (కోసిన ముక్కలు)
పాలు- ½ కప్పు
ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులు- 1 స్పూన్ (సన్నగా కట్ చేసుకోవాలి)
బ్లాక్ పెప్పర్ పౌడర్ – ½ స్పూన్
తయారీ విధానం
ప్యాన్ పొయ్యి మీద పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.ఆ తర్వాత అందులో పచ్చిబఠానీలు, నీళ్ళు పోసి కలపాలి.అందులో ఉప్పు వేయడం మాత్రం మర్చిపోకూడదు. బఠానీలు మెత్తగా ఉడికే వరకూ ఉడికించాలి.పచ్చిబఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుండి క్రిందికి దింపుకుని, చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ చేయాలి.
ఇప్పుడు మరో ప్యాన్ తీసుకుని,అందులో నీరు,పాలు ఉడికించి మెత్తని పేస్ట్ గా చేసిన పచ్చిబఠానీల పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.ఆ తర్వాత ఇందులోనే పెప్పర్, పుదీనా ఆకులను వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.
ఆ మిశ్రమం మంచి అరోమా వాసన వచ్చే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి.అంతే గ్రీన్ పీస్ అండ్ పుదీనా సూప్ రెడీ.
ఈ సూప్ బరువు తగ్గటంలో చాలా బాగా సహాయపడుతుంది.