ఈ సృష్టిలో భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణికి కూడా గ్రహ ప్రభావాలు ఉంటాయి.ఆ గ్రహ ప్రభావాలను అనుసరించే ఫలితాలు పొందాలని ఆ ప్రభావాల ఫలితాలను దేవతలు కూడా సంచరించిన సమయంలో వాటి ప్రభావాలు అనుభవించాల్సిందే.
రామాయణం, మహాభారతం నాటి గ్రంథాలలో ఈ విషయాలు తెలుపుతున్నాయి.అయితే ఈ గ్రహ బాధలు తొలగడానికి మానవులను రక్షించడానికి కలియుగంలో పఠించడానికి కొన్ని స్తోత్రాలు ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.
ఇక గురుబలం లేని వారి కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి.జాతకంలో బృహస్పతికి సంబంధించిన దోషాలు తొలగడానికి, గురు బలం పెంచుకోవడానికి నవగ్రహ బాధలు తొలగడానికి, శని బాధల నుండి విముక్తి పొందడానికి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని( Guru Dakshinamurthy Stotram ) పఠించినట్లయితే వారికి ఉన్న సకల గ్రహ దోషాలు బాధలు అన్నీ తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.

ఇది సూర్యునికి సంబంధించినది ఈ ఆదిత్య హృదయం రామాయణం, యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి( Agastya Maharshi ) రామునికి ఉపదేశించాడు.అయితే దీనిని రోజు ప్రాతః సమయమున పఠించినట్లయితే ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను పొందుతారు.మనుషులు దాగి ఉన్న కామ, క్రోతాది, అంతః శత్రువులను నాశనం చేస్తుంది.రుణ విమోచక అంగరక స్తోత్రం జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తుంటారు.
ఇక వాటిని తీర్చలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు.అలాంటప్పుడు ఈ స్తోత్రం 41 రోజులు పారాయణ చేస్తూ నవగ్రహాలకు( Navagraha ) రోజు 27 ప్రదక్షణలు చేయాలి.

ఇక చివరి రోజు కందులు, ఎరుపు రంగు వస్త్రం, ధనాన్ని, దక్షిణగా పెట్టి కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించాలి.ఇక మీ అప్పులు తప్పక తీరుతాయని చిలకమర్తి( Chilakamarthi ) తెలిపారు.విష్ణు సహస్రనామ స్తోత్రం( Vishnu Sahasranama Stotram ) ఈ స్తోత్రాన్ని 41 రోజులు పారాయణ చేయాలి.సాయంత్రం వేళ రోజు చేస్తే ఇంకా మంచిది.ఇక చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్రనామాలతో స్వామికి అష్టోత్తరం చేయించాలి.ఇలా చేయడం వలన మీ బాధలు తగ్గి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.
అలాగే మీకు సంతానం కలగడానికి శ్రీకాళహస్తి వెళ్లి రాహు, కేతు, కుజ గ్రహాలకు సర్పదోష నివారణ పూజ చేయించాలి.అప్పుడు తప్పక సంతానం కలుగుతుంది.