ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.వర్షాకాలం అంటే రోగాల కాలమని అంటుంటారు.
ఎందుకంటే, మిగిలిన సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌లోనే వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తుంటాయి.ముఖ్యంగా చిన్నారులు తరచూ దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి సీజన్ వ్యాధులకు గురవుతూ నానా ఇబ్బందులు పడుతుంటారు.
ఈ క్రమంలోనే వారిని రోజూ హాస్పటల్‌కి తిప్పుతూ తల్లిదండ్రులు తెగ విసిగిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే చిన్నారుల్లో సీజనల్ వ్యాధులును సులభంగా నివారించవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలకు జలబు, దగ్గు, తుమ్ములు వంటి సమస్యలు చూట్టేస్తాయి.
అయితే వీటిని నివారించడంలో వాము, బెల్లం అద్భుతంగా సహాయపడుతుంది.ఒక గ్లాస్ వాటర్‌లో ఒక స్పూన్ వాము, ఇక స్మూన్ బెల్లం తురుము వేసి మరిగించి.
గోరు వెచ్చగా అయిన తర్వాత పిల్లలకు పట్టించాలి.ఇలా చేస్తే జలబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి వంటివి త్వరగా తగ్గుతాయి.
ఈ సీజన్‌లో శ్వాస సంబంధిత సమస్యలతో పిల్లలు తెగ ఇబ్బంది పడుతుంటారు.
అయితే గోధుమలను, పసుపు కొమ్ములను ఈక్వల్‌గా తీసుకుని డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి.అపై ఈ పొడిని అర స్పూన్ చొప్పున తీసుకుని తేనె కలిపి ఉదయం, సాయంత్రం పిల్లలకు ఇవ్వాలి.ఇలా చేస్తే శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
అలాగే పిల్లల డైట్‌లో ఫాస్ట్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ వంటివి కాకుండా.ఓట్స్, డ్రైఫ్రూట్స్, గుడ్డు, మాంసం, తాజా కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు ఉండేలా చూసుకోవాలి.బొప్పాయి, దానిమ్మ, కివి, జామ, ఉసిరి, సీతాఫలం, అవకాడో వంటి పండ్లను తప్పకుండా చేర్చాలి.మరియు పిల్లల చేత వాటర్‌ను ఎక్కువగా తాగించాలి.తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా వారు రికవర్ అవుతారు.