కరోనా వైరస్.ఈ పేరు వినడం ప్రజలకు అలవాటు అయిపోయినా.దీని భయం మాత్రం రోజురోజుకు రెట్టింపు అవుతోంది.గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక కరోనా వైరస్.ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.
ఈ మాయదారి వైరస్ ఏదో రూపంలో వచ్చి పట్టేస్తోంది.
ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో.
దీనిని కట్టడి చేయడం పెద్ద సవాల్‌గా మారింది.ఇదే సమయంలో కరోనా గురించి కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
ఇక ఇప్పటివరకు కరోనా లక్షణాల్లో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం, ఒళ్లు నొప్పులు, విరోచనాలు వంటివి ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో లక్షణం చేరింది.కండ్లకలక లేదా పింక్ ఐ(లేత ఎరుపు రంగులో ఉన్న కళ్లు) కూడా కరోనా సంకేతమే అని తాజాగా నిపుణులు గుర్తించారు.వాస్తవానికి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యొక్క కరోనా లక్షణాల జాబితాలో పింక్ ఐ లేదు.
కానీ, ఈ లక్షణం కూడా కరోనాకు సంకేతమే కావచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని వారు చెబుతున్నారు.క్లారిటీగా చెప్పాలంటే.కేవలం ఒకటి నుంచి మూడు శాతం కరోనా కేసుల్లో కండ్ల కలక లేదా లేత గులాబీ రంగులో కళ్ల సమస్య ఉంటుందని లాంగోన్ హెల్త్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్, నేత్ర వైద్యుడు లీలా వి.రాజు తెలిపారు.ఇక ఏదేమైనా కండ్లకలక లేదా పింక్ ఐ ఉంటే.
కరోనా టెస్ట్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.