తలలో దురద కారణంగా చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.చుండ్రు, పేలు, దుమ్ము, ధూళి, కాలుష్యం, అలర్జీ ఇలా రకరకాల కారణాల తల తరచూ దురద పెడుతుంది.
ఇలా తరచూ తల దురద పెట్టడం వల్ల తీవ్రమైన చికాకు, ఇరిటేషన్ వస్తుంది.తల దురదను ఎలా పోగొట్టుకోవాలో తెలియక రకరకాల ష్యాంపూలు, నూనెలు మారుస్తూ.
వేలకు వేలు ఖర్చు చేస్తుంది.అయితే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.
తల దురద సమస్యను సలభంగా నివారించుకోవచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.
ముందుగా మందారం పూలు మరియు ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసి.తలకు, కుదుళ్లకు బాగా అప్లై చేయాలి.అర గంట పాటు తలను ఆరనిచ్చి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల తల దురద సమస్య తగ్గుముఖం పడుతుంది.
అలాగే కొన్ని బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి.ఉదయం పేస్ట్ చేసుకోవాలి.ఈ బాదం పేస్ట్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి.తలకు పట్టించాలి.ఆ తర్వాత కాసేపు వేళ్లతో మెల్ల మెల్లగా మసాజ్ చేసుకుని.ఆరనివ్వాలి.
అనంతరం సాధారణ ష్యాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఇక గోరింటాకును బాగా ఎండి పెట్టి పొడి చేసుకోవాలి.ఆ పొడిలో బీట్ రూట్ జ్యూస్ మరియు పెరుగు వేసి కలిపి.తలకు అప్లై చేయాలి.ఒక గంట పాటు అలా వదిలేసి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల కూడా తల దురద తగ్గుముఖం పడుతుంది.
మరియు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.