దివంగత హీరో నందమూరి హరికృష్ణ,( Nandamuri Harikrishna ) ఆయన భార్య శాలిని( Shalini ) దంపతుల గురించి మనందరికీ తెలిసిందే.ఈ దంపతుల కుమారుడే జూనియర్ ఎన్టీఆర్.
( Jr NTR ) ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక నందమూరి హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
ఇకపోతే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నందమూరి హరికృష్ణ అలాగే శాలిని ల ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజు కావడం విశేషం.

ఇది నిజంగా కాస్త ఆశ్చర్య పోవాల్సిన విషయమే అని చెప్పాలి.సెప్టెంబర్ రెండవ తేదీన హరికృష్ణ శాలిని దంపతులు జన్మించిన రోజు.అంటే ఎన్టీఆర్ తల్లిదండ్రులిద్దరూ ఒకేరోజు పుట్టారు.
అంటే ఇద్దరి పుట్టినరోజు సెప్టెంబర్ 2.ఎన్టీఆర్ తల్లి శాలినికి ఎప్పటి నుంచో సొంత ఊరికి వెళ్ళాలనే కోరిక ఉంది.తల్లి పుట్టిన రోజు సందర్భంగా కర్ణాటకలోని సొంత ఊరైన కుందాపూరకు( Kundapura ) తీసుకెళ్లారు ఎన్టీఆర్.అలాగే ఉడిపి శ్రీ కృష్ణమఠానికి కూడా తీసుకెళ్లారు.ఈ దైవ దర్శనంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి సహాయం చేశారట.ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వస్తున్నాడని తెలియడంతో ప్రశాంత్ నీల్ కూడా అక్కడికి వచ్చారట.
ఇలా అందరూ కలిసి దేవాలయాన్ని సందర్శించుకున్నారట.

తనను అక్కడికి తీసుకెళ్లడం తన తల్లి చిరకాల కోరిక అని, దాన్ని తీర్చడం, అది కూడా తన బర్త్ డేకి ఒక రోజు ముందే ఇలా జరగడం ఆనందంగా ఉంది అని ఎన్టీఆర్ వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు అడ్వాన్సుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.