రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో వాగులు వంకలు పొంగడంతో రైతులు ,మత్స్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని మల్యాల గ్రామంలో ఎంగల్ చెరువు మత్తడి దూకడంతో రైతులు కార్మికులు( Farmers , workers ) గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ శివారులో ఉన్న కాలువట్ దగ్గర రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు గ్రామస్తులు.ఈ సందర్భంగా గ్రామ మాజీ తాజా సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శనివారం రోజు నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండల ప్రజలు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయని ఆయన తెలిపారు.