తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నటి అభినయ( Abhinaya) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమిళనాడుకు చెందిన ఈమె పుట్టుకతోనే మాట్లాడలేదు, చెవులు కూడా వినపడవు.
అయినప్పటికీ తనకున్న లోపాలతో తాను వెనకడుగు వేయకుండా ఎదిరించి మరీ ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా అభినయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
ఆమె తల్లి ఆకస్మాత్తుగా చనిపోయారట.ఇదే విషయాన్ని అభినయ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
రిక్షాలో బయటకెళ్లిన ఆమె ఊహించని విధంగా కన్నుమూసిందట.
ఆగస్టు 17న ఇదంతా జరిగినట్లు అభినయ చెప్పింది.ఇన్ స్టాలో తల్లిని తలుచుకుని చాలా పెద్ద పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయింది.కానీ ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నట్టు ఆమె తెలిపింది.
కాగా ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చింది.అమ్మ నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
ఇలా సడన్‌గా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావనుకోలేదు.తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు.
తండ్రి, కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాద్ధృచ్చికమో కదా! నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు.ప్రతిచోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావ్.
ఇప్పుడు నీ బాధ్యతని సాయిసునందన్ తీసుకుంటాడు.జన్మంటూ ఉంటే మళ్లీ మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా అమ్మ.
రెస్ట్ ఫరెవర్ అమ్మ అని భావోద్వేగంతో అభినయ రాసుకొచ్చింది. తల్లి మరణంతో ఆమె ఫుల్ ఎమోషనల్ అయిపోయింది.ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియా( Social media)లో వైరల్ అవడంతో అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే అభినయ కెరియర్ విషయానికి వస్తే.
పుట్టుకతోనే బధిర అయిన అభినయ తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ( Seethamma Vakitlo Sirimalle Chettu )మహేష్ బాబు వెంకటేష్ కి చెల్లెలు పాత్రలో నటించి భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత నేనింతే, కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, గామి, ద ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.