వైరల్ వీడియో: నడిరోడ్డుపై కూర్చి వేసుకొని బైఠాయించిన తాగుబోతు.. చివరకు.?

చాలామంది ప్రజలు మద్యం సేవించక ముందు ఒకలా ఉంటారు.ఒకవేళ మద్యం సేవిస్తే ఆ తర్వాత వారు చేసే పనులు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.

 Viral Video: The Drunken Man Who Was Sitting On The Pavement Finally , A Video-TeluguStop.com

ఇలాంటి ఘటన తాజాగా ఓ తాగుబోతు చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రంలోని ప్రతాప్ ఘడ్ లో ఓ వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి అనంతరం నడిరోడ్డుపై అర్థనగ్నంగా కూర్చి వేసుకుని బైఠాయించాడు.ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్న సరే మద్యం మత్తలో అతడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా రోడ్డుపై కుర్చీలో వాహనాలకు అడ్డంగా కూర్చోగా ఆ సమయంలో చాలామంది అతడికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన కానీ అతడు వినకుండా ఉన్నాడు.జోరుగా వర్షం పడుతున్న సమయంలో కూడా అతడు రోడ్డుపై అడ్డంగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.

ఈ సమయంలో రోడ్డుపై అనేక వాహనాలు వెళుతూ ఉన్న అతనిని చూసి అతనిని తప్పించి పక్కనుంచి వెళ్ళిపోతున్నాయి.అయితే ఓ లారీ డ్రైవర్ మాత్రం అతడి తీరు నచ్చకపోవడంతో కుర్చీపై కూర్చున్న వ్యక్తిని ఒక్కసారిగా లారీ చివరతో ఢీకొట్టాడు.

అయితే ఈ చర్య కావలనే చేయడంతో అతడికి ఎటువంటి అపాయం కలగకుండా అతడిని గుద్దేశాడు.దీంతో మందు బాబుకు కుర్చీ ముక్కలు ముక్కలుగా అవ్వగా.అతడు కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు.అయితే అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడం సంతోషకరమైన విషయం.ఇక ఆ మందుబాబును అజయ్( Ajay ) గా గుర్తించారు అక్కడి స్థానికులు.విషయం తెలుసుకున్న పోలీసులు మందుబాబును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.

అయితే అక్కడి చేరుకున్న కుటుంబ సభ్యులు, అతడు మానసిక విగ్రహాన్ని తెలియజేయడంతో అతనిని తిరిగి మరి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు.ప్రస్తుతం ఈ ఘటనను అక్కడి ప్రజలు రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube