పవన్ కు వెరైటీగా బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన 800 మంది విద్యార్థులు.. ఇంత అభిమానమా?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను( Deputy CM Pawan Kalyan ) అభిమానులు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూనే రాజకీయాల్లో సైతం సక్సెస్ అయ్యారు.

 Kuppam Students Shows Their Affection On Pawan Kalyan Details, Pawan Kalyan, Dep-TeluguStop.com

తన సక్సెస్ స్టోరీతో పవన్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు( Pawan Kalyan Birthday ) కాగా కుప్పంలో నోబెల్ స్కూల్ కు చెందిన 800 మంది విద్యార్థులు వినూత్నంగా పవన్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

Telugu Deputycm, Kuppam, Nobel School, Pawan Kalyan, Ustaadbhagat-Movie

పవన్ ఫోటో ప్రతిబింబం వచ్చే విధంగా విద్యార్థులు ( Students ) సమూహారంగా ఏర్పడి పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ఒక స్టార్ హీరో విషయంలో ఇంతలా అభిమానాన్ని చాటుకోవడం కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే జరిగిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చిన్నపిల్లల్లో సైతం పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Telugu Deputycm, Kuppam, Nobel School, Pawan Kalyan, Ustaadbhagat-Movie

పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ సైతం పవన్ పుట్టినరోజు కానుకగా రానున్నాయనే సంగతి తెలిసిందే.ఓజీ,( OG ) ఉస్తాద్ భగత్ సింగ్,( Ustaad Bhagat Singh ) హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) సినిమాల నుంచి టీజర్స్, పోస్టర్స్ రానున్నాయి.పవన్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ సైతం వచ్చే ఛాన్స్ ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరు అని ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.వరుస సినిమాలతో పవన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube