మీ ఇంటి సభ్యుడిగా అందరికీ ఇదే నా విన్నపం.. చిరు కామెంట్స్ వైరల్!

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు( Heavy Rains ) పడుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా తుఫాను కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలి అన్న కూడా భయపడుతున్నారు.

 Chiranjeevi Urges People To Stay In Home Amid Heavy Rains Details, Chiranjeevi,-TeluguStop.com

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా కొన్ని లోతట్టు గ్రామాలు జలమయమైన విషయం తెలిసిందే.ఏపీలో కూడా గత మూడు నాలుగు రోజులుగా కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.

దీంతో ప్రజలు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా సెలవులు ప్రకటిస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ భారీ వర్షాలను ఉద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి.ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దు.

వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు.

ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారని అవసరమైన వారికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నాను అని చిరంజీవి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.కాగా బంగాళాఖాతంలో( Bay Of Bengal ) వాయుగుండం ఏర్పడిన విషయం తెలిసిందే.ఈ వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో తీరం దాటింది.దీని ప్రభావంతో ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube