సాధారణంగా తల్లిదండ్రులు ( Parents ) పిల్లలపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పిల్లలకు ( Children ) ఎటువంటి కష్టం రాకుండా వారి వెంటే ఉంటూ వారి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా తన కుమారుడి ఆరోగ్యం కోసం ఒక తండ్రి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
తమిళనాడులోని కోయంబత్తూర్ లో( Coimbatore ) బోచే పుడ్ ఎక్స్ ప్రెస్ అనే ఒక రెస్టారెంట్లో పోటీలో నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలో తాజాగా ఈ రెస్టారెంట్ వారు బిర్యాని ఈటింగ్ ఛాలెంజ్ ను( Biryani Eating Challenge ) కూడా ప్రకటించారు.
అరగంటలోపు ఆరు చికెన్ బిర్యాని తిన్న వారు విజేతలుగా నిలుస్తారని రెస్టారెంట్ వాళ్ళు తెలిపారు.అలా ఈ చాలెంజ్లో 6 బిర్యానీలు తిన్నవారికి లక్ష రూపాయలు బహుమతిగా, నాలుగు బిర్యానీలు తిన్నవారికి 50,000గా, అలాగే మూడు బిర్యానీలు తిన్నవారికి 25000గా ప్రైజ్ మనీ ని నిర్ణయించారు.
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన గణేష్ మూర్తి( Ganesh Murthi ) అనే కుమారుడు ఆటిజంతో( Autism ) బాధపడుతూ ఉన్నాడు.ఈ ఛాలెంజ్ లో విజయం సాధించే తన కుమారుడు చికిత్స కోసం ఆ డబ్బులు పనికి వస్తాయని ఆ తండ్రి ఒకవైపు తన కుమారుడి ఆరోగ్యం బాగా లేదని మరోవైపు ఈ చాలెంజ్ లో ఎలాగైనా విజయం సాధించాలని గణేష్ మూర్తి బిర్యానీ తినడం మొదలుపెట్టాడు.అలా మొత్తంగా కడుపులో బిర్యాని పట్టకపోయినా ఒకవైపు తన ఛాతి నుంచి నొప్పి వస్తున్న కూడా కొడుకు ఆరోగ్యం కోసం అలానే బిర్యానిలు తిన్నాడు.
మొత్తానికి గణేష్ మూర్తి నాలుగు బిర్యానీలు తిని 50 వేల రూపాయలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా మరోవైపు తన కొడుకు ఆరోగ్యం చికిత్స కోసం, చదువుల కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మరి ఈ చాలెంజ్ లో పాల్గొన్నాడు గణేష్ మూర్తి.ఇక ఈ సాహసం చూసిన వారందరూ ఇది ఫుడ్ చాలెంజ్ కాదు ఒక తండ్రి ఎమోషనల్ స్టోరీ అంటూ తెలియచేశారు.