వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉండటం సర్వ సాధారణ విషయం.ముఖ్యంగా చర్మంపై ముడతలు, సన్నని గీతలు లేదా చర్మం సాగటం వంటివి జరుగుతుంటాయి.
కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ ఏజ్‌లోనే ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, చర్మం విషయంలో సరైన కేర్ తీసుకోకపోవడం, పోషకాల లోపం, కాలుష్యం ఇలా రకరకాల కారణాల వల్ల ముడతల సమస్య ఏర్పడుతుంది.
ఇక ఈ సమస్యను నివారించుకునేందుకు మార్కెట్‌లో దొరికే ఏవేవో క్రీములు, లోషన్లు వాడుతారు.
అయితే ఈ ప్రోడెక్ట్స్ ఇప్పుడు మీకు సంతృప్తిని ఇచ్చినా.
భవిష్యత్తులో మాత్రం అనేక చర్మ సమస్యలను తెచ్చి పెడతాయి.అందుకే ఏ సమస్యనైనా న్యాచురల్‌గానే తగ్గించుకోవాలి.
అయితే ముఖాన్ని ముడతలు లేకుండా బిగుతుగా, తెల్లగా మార్చడంలో ఐస్ ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఐస్ ప్యాక్ ఎలా చేయాలి.ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముడతలను నివారించడంలో మిల్క్ ఐస్ క్యూబ్స్ గ్రేట్‌గా సహాయపడతాయి.
అందుకోసం ఐస్ ట్రేలో పాలు పోసి ఐదారు గంటల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఐస్ క్యూబ్స్ అవుతాయి.ఇప్పుడు వాటిని తీసుకుని ఒక కటన్ క్లాత్‌లో వేసి.
ముఖానికి రుద్దుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే ముడతలు తగ్గి చర్మం బిగుతుగా మరియు తెల్లగా మారుతుంది.
అలాగే ఐస్ ట్రేలో వాటర్ మరియు రోజ్ వాటర్ రెండూ వేసి కలిపి.నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ అవుతాయి.వీటిని కాటన్ క్లాత్‌లో చుట్టి.ముఖం, కళ్ల చుట్టు, పెదవులపై సున్నితంగా రుద్దుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల ముడతలు తగ్గు ముఖం పడతాయి.పెదాల పగుళ్లు పోతాయి.
మరియు డార్క్ సర్కిల్స్ సమస్య కూడా దూరం అవుతుంది.